పంజాబ్‌లోని సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లు, డ్రోన్ల ద్వారా ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకు అమృత్సర్ కౌంటర్ ఇంటెలిజెన్స్, సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)(bsf punjab news) సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఖేమ్కరన్ సెక్టార్‌లోని మహందీపుర్లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మత్తుపదార్థాలను(heroine news) స్వాధీనం చేసుకున్నాయి.
పొలాల్లో జారవిడిచిన మూటల్లో మొత్తం 22 తుపాకులు, 44 మ్యాగజైన్స్, 100 తూటాలు, ఒక కిలో హెరాయిన్, 72 గ్రాముల ఓపియం మత్తుపదార్థాలు దొరికినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వీటిని పాక్ నుంచి దేశంలోకి డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. రాజ్తల్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి డ్రోన్ల శబ్దాలు సైతం వినిపించాయని, అప్రమత్తమైన బలగాలు.. కాల్పులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
పండగల వేళ భద్రత పెంపు..
పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంజాబ్వాప్తంగా భద్రతను పెంచారు అధికారులు. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబాటుకు యత్నిస్తున్న వారి అరెస్టులు పెరిగాయి. పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోని సరిహద్దుల ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మత్తుపదార్థాల స్మగ్లింగ్ పెరిగిన నేపథ్యంలో భద్రతా దళాలు నిఘా పెంచాయి.
రూ.22 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..
మరోవైపు.. ముంబయిలోని సియోన్ కోలివాడా ప్రాంతంలో మత్తుపదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్న ఓ మహిళను(53)ను అరెస్ట్ చేశారు మాదకద్రవ్యాల నిరోధక విభాగం అధికారులు. మహిళ వద్ద రూ.21.70 కోట్ల విలువైన 7.2 కిలోల హెరాయిన్‌ను(heroine news) స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ముంబయిలోని సబ్అర్బన్ మంఖుద్ ప్రాంతానికి చెందిన అమీనా హమ్జా షేక్ అలియాస్ లాలీగా గుర్తించారు. లాలీతో సంబంధాలు ఉన్న వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం