ETV Bharat / bharat

రూపాయి చిల్లర లేదన్న కండక్టర్​.. ప్రయాణికుడి మూడేళ్ల పోరాటం.. ఆర్టీసీకి రూ.3వేలు ఫైన్​

author img

By

Published : Feb 23, 2023, 10:42 AM IST

ప్రయాణికుడికి ఇవ్వాల్సిన రూపాయి చిల్లర ఇవ్వలేదు ఓ కండక్టర్. దీంతో ప్రయాణికుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్​కు రూ.3 వేలు ఫైన్ విధించింది.

consumer court fine on bmtc bus
ప్రయాణికుడికి రూపాయి ఇవ్వలేదని జరిమానా

సాధారణంగా బస్సు ఎక్కితే చిల్లర లేక కొన్నిసార్లు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. ఛార్జీకి తగ్గ చిల్లర లేకపోవడం వల్ల రూ.100, రూ.500 నోట్లు ఇస్తుంటారు. కండక్టర్ చిల్లర లేదు.. బస్సు దిగేటప్పుడు ఇస్తానని చెబుతుంటారు. కొన్నిసార్లు రూ.10 ఛార్జీ చిల్లర లేక రూపాయి తరువాత ఇస్తానని అంటారు. అయితే తనకు ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వనందుకు ఓ ప్యాసింజర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. మూడేళ్లుగా పోరాడి విజయం సాధించాడు. అసలు ఏం జరిగిందంటే?

రమేశ్​ నాయక్ అనే వ్యక్తి 2019 సెప్టెంబరు 11న బెంగళూరులోని శాంతినగర్​లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) వాల్వో బస్సు ఎక్కాడు. అతడి బస్సు టిక్కెట్ ఛార్జీ రూ.29 కాగా.. కండక్టర్​కు 30 రూపాయలు ఇచ్చాడు. అయితే కండక్టర్ రూపాయి చిల్లర రమేశ్​ నాయక్​కు తిరిగి ఇవ్వలేదు. దీంతో బీఎంటీసీ.. తనకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని బెంగళూరు నాల్గో అదనపు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు రమేశ్​. ఈ క్రమంలో.. రమేశ్​ నాయక్​ వేసిన వ్యాజ్యంపై బీఎంటీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదొక సిల్లీ కేసు అని కోర్టుకు తెలిపింది. ఫిర్యాదును కొట్టివేయాలని వినియోగదారుల కోర్టును కోరింది.
అయితే దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు రమేశ్​కు రూ.3 వేలు పరిహారం ఇవ్వాలని బీఎంటీసీని ఆదేశించింది. రూ. 2 వేలు పరిహారం, కోర్టుకు హాజరయ్యేందుకు రమేశ్​కు అయ్యిన ఖర్చుల నిమిత్తం మరో రూ.1,000 చెల్లించాలని పేర్కొంది.

'ప్రయాణికుడు దాఖలు చేసిన వ్యాజ్యం సిల్లీది కాదు. అనవసరమైనది కాదు. ఫిర్యాదుదారుడు తనకు రావాల్సిన డబ్బును హక్కుగా భావించి కోర్టును ఆశ్రయించారు. ఇది వినియోగదారుల హక్కులకు సంబంధించిన అంశం. ఫిర్యాదుదారుడి కృషిని అభినందించాలి.

--వినియోగదారుల కోర్టు

అంతకుముందు, కర్ణాటక ధార్వాడ్​లోని జిల్లా వినియోగదారుల కమిషన్ సైతం ఓ తీర్పును ఇచ్చింది. ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా, ఖాతా నుంచి డెబిట్ చేసి తిరిగి చెల్లించని బ్యాంకుకు వినియోగదారుల న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. రూ.500 నష్టపోయిన ఖాతాదారుడికి పరిహారంగా రూ.1,02,700 చెల్లించాలని ఆదేశించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.