Himachal Pradesh Election 2022 : హిమాచల్‌ప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 46 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది.
మరోవైపు, అధికార భాజపా 62 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన హాజరైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సభ్యులు హాజరయ్యారు. భేటీలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన భాజపా.. బుధవారం 62 మంది పేర్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. సిరాజ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మండీ నుంచి అనిల్ శర్మ, ఉనా నుంచి సత్పాల్ సింగ్ పోటీ పడనున్నారు.
-
BJP releases a list of 62 candidates for the upcoming #HimachalPradesh Assembly election.
— ANI (@ANI) October 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
CM Jairam Thakur to contest from Seraj, Anil Sharma to contest from Mandi and Satpal Singh Satti to contest from Una.
The election is scheduled to be held on 12th November. pic.twitter.com/hm7ZX0UDle
">BJP releases a list of 62 candidates for the upcoming #HimachalPradesh Assembly election.
— ANI (@ANI) October 19, 2022
CM Jairam Thakur to contest from Seraj, Anil Sharma to contest from Mandi and Satpal Singh Satti to contest from Una.
The election is scheduled to be held on 12th November. pic.twitter.com/hm7ZX0UDleBJP releases a list of 62 candidates for the upcoming #HimachalPradesh Assembly election.
— ANI (@ANI) October 19, 2022
CM Jairam Thakur to contest from Seraj, Anil Sharma to contest from Mandi and Satpal Singh Satti to contest from Una.
The election is scheduled to be held on 12th November. pic.twitter.com/hm7ZX0UDle
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 17
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
- పోలింగ్ తేదీ: నవంబర్ 12
- ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబర్ 8
హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మొత్తం 55,07,261 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,80,208 పురుషులు కాగా.. 22,27,016 మంది మహిళా ఓటర్లు. ఈ ఎన్నికల్లో తొలిసారి 1,86,681మంది యువత ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో పూర్తికానుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న భాజపా అధికారం నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కసరత్తులు చేస్తోంది. ఇంకోవైపు, పంజాబ్‌లో తిరుగులేని విజయంతో మంచి జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రచారం చేసిన దిల్లీ సీఎం కేజ్రీవాల్.. నిరుద్యోగ భృతి, 6లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: హిమ సీమలో ఎన్నికల వేడి.. కమలం నిలుస్తుందా?.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా!
వేడి పుట్టిస్తున్న హిమాలయ రాజకీయాలు.. ఐదేళ్లకోమారు తారుమారు.. మరి ఈ సారి?