ETV Bharat / bharat

రాహుల్​కు షాక్​.. పరువు నష్టం కేసులో 'స్టే' పిటిషన్​ కొట్టివేత.. జాగ్రత్తగా మాట్లాడాల్సిందన్న జడ్జి - రాహుల్​ గాంధీ మోదీ ఇంటిపేరు

పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్​ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. రాహుల్​ గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో చట్టప్రకారం తమకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ తెలిపింది. కోర్టు నిర్ణయం ప్రజలు సాధించిన విజయమంటూ బీజేపీ పేర్కొంది. ఇది రాహుల్ అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పు అని వ్యాఖ్యానించింది.

rahul gandhi defamation case
rahul gandhi defamation case
author img

By

Published : Apr 20, 2023, 11:11 AM IST

Updated : Apr 20, 2023, 3:45 PM IST

పరువు నష్టం కేసులో శిక్షపడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో చుక్కెదురైంది. ఆయన తనకు పడిన శిక్షపై స్టే విధించాలని చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​ను సూరత్​ సెషన్స్​ కోర్టు జడ్జి ఆర్‌పీ మొగేరా తిరస్కరించారు. ఈ సందర్భంగా జడ్జి ఆర్​పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు.

"రాహుల్ గాంధీ..​ పార్లమెంట్ సభ్యుడు. అలాగే మోదీపై వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన దేశంలోని రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో ఆయన జాగ్రత్తగా మాట్లాడాల్సింది. అప్పీల్​దారు చేసిన వ్యాఖ్యలు బాధిత వ్యక్తికి మానసిక వేదనను కలిగించేలా ఉన్నాయి. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వల్ల.. కచ్చితంగా ఫిర్యాదుదారుడు పూర్ణేశ్ మోదీ ప్రతిష్ఠకు హాని కలిగి ఉండవచ్చు. అలాగే ఆయనకు మానసిక వేదనకు కారణం కావొచ్చు."

--ఆర్‌పీ మొగేరా, సూరత్​ సెషన్స్​ కోర్టు జడ్జి

సూరత్​ సెషన్స్​ కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత జైరాం రమేశ్​.. ట్విట్టర్​ వేదికగా స్పందించారు. చట్టం ప్రకారం తమకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.

'రాహుల్​ అహంకారానికి చెంపపెట్టు'
సూరత్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది బీజేపీ. పిటిషన్​ను కోర్టు కొట్టివేయడం.. న్యాయ వ్యవస్థతో పాటు ప్రజలు సాధించిన విజయమని చెప్పుకొచ్చింది. గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ అహంకారానికి ఈ నిర్ణయం చెంపపెట్టు అని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ సమానమేనని ఇప్పుడు నిరూపితమైందని అన్నారు.
రాహుల్ తనను తాను చట్టానికి అతీతులుగా ఎందుకు భావిస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రశ్నించారు. ఆయన్ను ప్రత్యేకంగా పరిగణించాలన్న కాంగ్రెస్ నాయకుల డిమాండ్లపై తీవ్రంగా మండిపడ్డారు.

వాదనలు ఇలా..
రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​పై సూరత్ సెషన్స్ కోర్టు.. ఏప్రిల్​ 13న ఇరువర్గాల వాదనలు ఆలకించింది. ఆ సమయంలో రాహుల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎస్ చీమా.. మోదీ అనేది కులం పేరు కాదని అన్నారు. రాహుల్​కు శిక్ష విధించిన జడ్జిని ఎవరో తప్పుదోవ పట్టించారని చెప్పారు. జడ్జి కఠిన పదాలు ఉపయోగించడం సరికాదని వాదించారు. "రాహుల్​కు విధించిన శిక్షలో ఒక్కరోజు తగ్గినా.. అనర్హత వేటు పడదని కోర్టుకు తెలుసు. ఆయన్ను దోషిగా తేల్చి అరగంట వ్యవధిలో అత్యంత కఠినమైన శిక్ష విధించారు. సుప్రీంకోర్టు రాహుల్​ను హెచ్చరించిందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని కఠిన వ్యాఖ్యలు చేసింది. కానీ, ఆయన ప్రసంగం.. సుప్రీంకోర్టు హెచ్చరికల కన్నా ముందే జరిగింది" అని రాహుల్​ తరఫు న్యాయవాది తెలిపారు.

అంతకుముందు.. ఏప్రిల్ 3న నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాహుల్. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 13 వరకు రాహుల్​కు బెయిల్​ను పొడిగించింది. సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్షను సస్పెండ్‌ చేయాలని ఈ రెండు పిటిషన్లలో కోరారు. అయితే అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడించింది.

కేసు ఏంటంటే?
2019 లోక్​సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. అనంతరం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దైంది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇటీవలే రాహుల్​.. తన బంగ్లాను ఖాళీ కూడా చేశారు.

Last Updated : Apr 20, 2023, 3:45 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.