ETV Bharat / bharat

కాంగ్రెస్​కు సిబల్ గుడ్​బై.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు.. ఎస్పీ మద్దతు - Kapil Sibal News

Kapil Sibal
కాంగ్రెస్​కు కపిల్ సిబల్ రాజీనామా.. రాజ్యసభకు ఎస్పీ తరఫున నామినేషన్​
author img

By

Published : May 25, 2022, 12:33 PM IST

Updated : May 25, 2022, 1:27 PM IST

12:29 May 25

కాంగ్రెస్​కు కపిల్ సిబల్ రాజీనామా.. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్​

Kapil Sibal News: కాంగ్రెస్​కు మరో సీనియర్ నేత షాక్​ ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది​ కపిల్​ సిబల్​ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో లఖ్​నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసినట్లు నామినేషన్ అనంతరం సిబల్ వెల్లడించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్​ దాఖలు చేశానని, ఎస్పీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఎప్పటినుంచో రాజ్యసభలో స్వతంత్ర గొంతుక కావాలనుకుంటున్నట్లు చెప్పారు.

Congress News: కాంగ్రెస్ పార్టీకి కొద్దికాలంగా వరుస షాక్​లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజస్థాన్​లో చింతన్ శిబిర్ కార్యక్రమం నుంచి ఇప్పటివరకు ముగ్గురు సీనియర్ నేతలు పార్టీకి గుడ్​పై చెప్పారు. తొలుత పంజాబ్ సీనియర్ నేత సునీల్​ జాఖర్​ కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరారు. ఆ తర్వాత గుజరాత్​ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్​ కాంగ్రెస్​కు గుడ్​పై చెప్పారు. ఆయన ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. ఇప్పుడు కపిల్ సిబల్ హస్తం పార్టీని వీడారు.

కపిల్ సిబల్​ కాంగ్రెస్ అసమ్మతి జి‌23 నేతల్లో ఒకరిగా ఉన్నారు. కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఎస్పీ నేత ఆజంఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో రెండేళ్ల తరువాత మధ్యంతర బెయిల్​పై ఆజం ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు.

Last Updated : May 25, 2022, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.