ETV Bharat / bharat

ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​గా వైఎస్‌ షర్మిల నియామకం - వైఎస్‌ షర్మిల చిత్రాలు

Congress Declared AP PCC Chief YS Sharmila

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 2:30 PM IST

Updated : Jan 16, 2024, 10:02 PM IST

14:27 January 16

షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందంటూ ఏఐసీసీ ప్రకటన

Congress Declared AP PCC Chief YS Sharmila: రాష్ట్రంలో హస్తం పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్‌. షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నగిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత కమిటీగా చెప్పుకునే, సీడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించింది. వై.ఎస్‌.షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా నియామకం కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల్లోకి వెళ్లారు. దీంతో నాయకత్వం వహించేందుకు నాయకులు ఎవరు ముందుకు రాని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో పోటీ చేసేంత సామర్థ్యం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి లేకుండా పోయింది. వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసి, ఆ పార్టీని పూర్తిగా రాష్ట్రానికే పరిమితం చేశారు. 2019శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణాలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని 2021 జులై 8వ తేదీన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 4 వరకు రెండున్నరేళ్లపాటు తెలంగాణాలో పార్టీని నడిపారు. ఈ సమయంలో తెలంగాణాలో పాదయాత్ర చేసి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌లో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేసినా, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్వాగతించలేదు. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుని ఏపీలో కీలకపదువులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏఐసీసీకి నివేదించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ నెల 4వతేదిన దిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతోపాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
జగన్‌కు వ్యతిరేకంగా సొంతవాళ్లు పని చేసినా ప్రతిపక్షంగానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో వచ్చిన ఆగ్రహం, క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అధిష్ఠానం సూచన మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగిన వైఎస్ షర్మిల, ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షురాలిగా నియమతులవుతారని ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రుద్రరాజును ఉన్నపళంగా రాజీనామా చేయించారు. వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు.
షర్మిల వల్ల వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు: సజ్జల

వైఎస్‌ షర్మిలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి గిడుగు రుద్రరాజును ఉన్నపళంగా తొలిగించడం ద్వారా రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం... ఆయనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఇరువురు నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది. అవి తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంపై ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మ, కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. షర్మిల నియామకం రాష్ర్టంలో హస్తం పార్టీ బలపేతానికి దోహదం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పటికే నలుగురు కార్యనిర్వహక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సుంకర పద్మశ్రీ, మస్తాన్‌ వలి, జంగా గౌతమ్‌, రాకేష్‌ రెడ్డిలు పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంతో కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరుగుతుందని అధిష్ఠానం అంచనా వేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన బలం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ పెద్దలు, సీనియర్లతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల

Last Updated : Jan 16, 2024, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.