జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు దర్శనమివ్వటం కలకలం సృష్టించింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ప్రదేశంలో భారీగా కండోమ్‌లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు జనాలు. ఈ దృశ్యం కర్ణాటక తుమకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై కనిపించింది.
నగర శివారులోని శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌పై కుప్పలుగా కండోమ్‌లు కనిపించాయి. అయితే.. అక్కడ వాటిని ఎవరు పారవేశారనేది తెలియరాలేదు.
పైవంతెనపై కండోమ్‌లు అనుకోకుండా పడిపోయాయా? లేదా ఎవరైనా కావాలనే పారవేశారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కుప్పల్లో ఉన్న కండోమ్‌లు కొన్ని వినియోగించినవి కాగా.. కొన్ని ప్యాకెట్ల నుంచి తీయకుండా ఉన్నాయి.
ఇదీ చూడండి: రహదారి పక్కన లారీల నిండా కండోమ్‌లు.. ఎక్కడివి?