ETV Bharat / bharat

ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు - ఏపీలో అక్రమ కోడిపందాలు

Cockfights and Gambling in AP: రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు, జూదం, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జూదం, గుండాట ఆడుతున్నారు. పలు చోట్ల కోడి పందేల నిర్వాహణకు అనుమతులు లేవంటూ పోలీసులు అడావిడి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో కోడి పందేలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు పట్టించుకోలేదు.

Cockfights and gambling in full swing in Andhra Pradesh

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:07 PM IST

ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Cockfights and Gambling in Full Swing in Andhra Pradesh: సంక్రాంతి వేళ రెండోరోజూ కోడిపందేలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేల బరుల పక్కనే జూద క్రీడలు జరుగుతున్నా, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ నేతల అండతో, బెట్టింగ్‌ రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు, జూదం, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే కోడి పందేలు, పొట్టేలు పోటీలు సాగుతున్నాయి. కోడి పందేల మాటున కోట్ల రూపాయల బెట్టింగ్‌ సాగుతోంది. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక శిబిరాలు పెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలు చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో పోలీసులు పట్టించుకోలేదు.

చంద్రన్న సంక్రాంతి సంబరాలు - అంబరాన్నంటేలా మహిళా కబడ్డీ పోటీలు

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పందేలు కాస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు ఇలాఖా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పందేం రాయుళ్లు భారీగా బరులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జూదం, గుండాట ఆడుతున్నారు. అధికారులు అటు కన్నెత్తయినా చూడకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లలోని పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, అమరావతి మండలంలోని ఉంగుటూరులో భారీగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

గుండాటలో డబ్బులు పొగొట్టుకున్న ఎమ్మెల్యే! - రోడ్డు పక్కన జనంలో కలిసి మరీ

ఉభయగోదావరి జిల్లాల్లో అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు రెండు జిల్లాల్లో కలిపి రూ. 70 నుంచి 80 కోట్ల వరకు నగదు చేతులు మారింది. రెండో రోజూ వంద కోట్లకుపైగా డబ్బు చేతులు మారొచ్చని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, వేల్పూరు, తూర్పు గోదావరిలోని ఉండ్రాజవరం, సూర్యారావు పాలెం, ముప్పవరం, తదితర ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. గుండాటలు, జూదం ఆడేవాళ్లతో బరులన్నీ కిక్కరిసి పోతున్నాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఎన్నడూ లేని విధంగా 18 బరుల్లో పందేలు, గుండాటలు నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో కోడిపందేల బరులు వద్ద పోలీసులు ఉదయం సమయంలో కాస్త హడావిడి చేసి, టెంట్లు తొలగించారు. అధికార పార్టీ స్థానిక నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వెనుదిరిగారు. పందేపు రాయుళ్లు మళ్లీ టెంట్లు వేసి యథావిధిగా ఆటలు కొనసాగించారు.

ఊరంతా సంక్రాంతి సంబరాలు - రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఎల్లోటి సమీపంలో జూద కేంద్రంపై పోలీసులు దాడలు చేశారు. అయిదుగురిని అరెస్టు చేసి, లక్షా పదివేల రూపాయలు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.