AP CM Jagan Ruling Opposite to Dr BR Ambedkar Policies : ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar). ఆయన అందించిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసిన నిరంకుశ పాలకుడు ఏపీ సీఎం జగన్. అంబేడ్కర్ తత్వం స్వేచ్ఛాప్రియత్వం. జగన్‌ది పోతపోసిన పెత్తందారీ వ్యక్తిత్వం, ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. మహానుభావుడు అంబేడ్కర్ పేరెత్తే అర్హతైనా లేని మకిలి మనస్తత్వం జగన్‌ది ! భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించడం (Ambedkar Statue Inauguration) - ఆ దార్శనికుడి దివ్యస్మృతికి దారుణ అవమానం!
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
అబ్కారీశాఖపై ప్రభుత్వం తనకున్న అధికారాన్ని ఆదాయాన్ని పిండుకునేందుకు కాకుండా మద్యం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కాకుండా నిరోధించాలి. మద్యపాన దురలవాటు నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిందిది.
జగన్ చేసింది ఇది : కానీ జగన్ చేసిందేంటి? నేను బటన్లు నొక్కాలి. జనం తాగి ఊగాలి అంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచారు! కుర్చీ ఎక్కినప్పట్నుంచీ ఖజానాను సారా సొమ్ముతో నింపుకున్నారు! దశల వారీ మద్య నిషేధం అని మాటిచ్చి రివర్స్‌లో పేదల రక్తమాంసాలు పిండుకున్నాడు. లక్షా 15 వేల కోట్లు ఆదాయం దండుకున్నాడు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ప్రజల మేలుకోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా వినియోగించాలి. లేదంటే రుణాలు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ఆర్థిక వనరులకు భారంగా పరిణమిస్తుందన్నది అంబేడ్కర్ మాట!
మీరు చేసింది జగన్ : ఈ విషయంలో జగన్ ఏం చేశారు? రాష్ట్ర రుణ భారాన్ని పది లక్షల కోట్లు దాటించారు. సంపద సృష్టిని మరిచిపోయి అందిన చోటల్లా అప్పులు తెచ్చారు. జీతాలు, పింఛన్లు, గుత్తేదారులకు బిల్లులు ఇలా ఏవీ సకాలంలో ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుక్కలు చింపిన విస్తరి చేశారు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ఆదాయాలకు మూలమైన పరిశ్రమలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమల్ని నాశనం చేయదలచుకున్న వారు ప్రజాబంధులు కాదు. తన దృష్టిలో అలాంటి వారు ప్రజాశత్రువులే అన్నది అంబేడ్కర్ మాట!
జగన్ చేసింది ఇది : కానీ జగన్ బాట! పరిశ్రమల్ని తరిమేయడం, రాజకీయ కక్షతో పారిశ్రామిక వేత్తల్ని హింసించడం! అమరరాజా, జాకీ, రిలయన్స్, ఏషియన్ పల్ప్, లులూ వంటి సంస్థల్ని వెళ్లగొట్టింది జగన్ రాక్షస ముఠా కాదా?
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
విద్యావ్యాప్తికి కృషి చేయడమే విశ్వవిద్యాలయాల కర్తవ్యం! స్థానిక భాషను బోధనా మాధ్యమంగా స్వీకరిస్తే తప్ప ఆ లక్ష్యం నెరవేరదు. ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరగాలన్నది తన కచ్చితమైన అభిప్రాయమని అంబేడ్కర్ చెప్పారు.
జగన్ చేసింది ఇది : సామాజిక న్యాయం అంటూ ప్రచారం చేసుకుంటున్న జగన్ చేసిందేంటి? మాతృభాషను మృతభాషగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. పరాయి భాషలో బోధించగలిగే ఉపాధ్యాయులు లేకుండా ప్రాథమిక తరగతుల్లోని పిల్లలకు ఆంగ్లంలోనే చదువులు చెప్పాల్సిందేనని చెలగాటమాడుతున్నారు. అశాస్త్రీయ ఆలోచనలు, అసంబద్ధ వాదనలతో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల్ని దెబ్బతీసి రేపటి పౌరులకు తీరని అన్యాయం చేశారు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే క్రియాశీలక ప్రతిపక్షం ఉండి తీరాలి. పాలకుల తప్పొప్పులు ఎండగట్టి ప్రజలకు జవాబుదారీ చేయడానికి గట్టి విపక్షం అత్యవసరమని అంబేడ్కర్ నిక్కచ్చిగా చెప్పారు.
జగన్ చేసింది ఇది : కానీ జగన్ చేసిందేంటి? అధికార మదం తలకెక్కించుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు, నేతల్ని పెట్టుడు కేసులతో పీడిస్తున్నారు. ఎవరు ఎదురు చెప్పినా అక్రమ కేసులతో కాల్చుకుతింటున్నారు. చివరకు సోషల్ మీడియా పోస్టుల్నీ సహించలేక పోలీసుస్వామ్యానికి తెరతీశారు. హిట్లర్‌ను మించిన నియంతలా మారి ప్రజాస్వామ్యాన్ని రాచిరంపాన పెడుతున్నారు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
పౌరుల భావప్రకటనా హక్కులో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికల్లో రాయడం అంటే సంబంధిత వ్యక్తులు తమ భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకోవడం. శాంతిభద్రతలు, నైతిక ప్రయోజనాలకు తప్ప, భావప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్య్రాన్ని కుదిస్తూ ఏ చట్టమూ చేయకూడదన్నది అంబేడ్కర్ మాట.
జగన్ చేసింది ఇది : కానీ జగన్ అనైతిక ప్రయోజనాలకోసం విమర్శనాత్మక వార్తలు ప్రచురించే పత్రికలపై కత్తిగట్టారు. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపే పత్రికలు, ఛానళ్లపై పగ తీర్చుకునేందుకు 2430పేరిట నల్ల జీవో తెచ్చారు. తనకు డప్పుకొట్టకపోతే అంతుచూస్తానన్నట్లు తెల్లదొరల నాటి చీకటి చట్టాన్నీ వాడుకున్నారు. రెండు ఛానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టారు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ఎన్నికలు సక్రమంగా నిష్పాక్షికంగా జరగడం ప్రజాస్వామ్యానికి పునాదిలాంటిది. చట్టసభలకు ఎవరిని పంపించాలన్నది పూర్తిగా ప్రజల ఇష్టం. అందుకే ఓటుహక్కు వినియోగంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలన్నది రాజ్యాంగ నిర్మాత అభిమతం.
జగన్ చేసింది ఇది : కానీ జగన్‌ది అసలు ఎన్నికలు అవసరమా! అనే మనస్థత్వం. ఎన్నికలంటూ జరిగితే వైఎస్సార్సీపీ మద్దతుదారులు తప్ప వేరెవర్నీ ఓటేయనీయరాదనే బరితెగింపు. పొరుగు రాష్ట్రాల జనంతో దొంగ ఓట్లేయించి నిస్పాక్షిక ఎన్నికలకు సమాధికట్టిన దుర్మార్గం జగన్‌ది. నేటికీ ఓటరు జాబితాలతో బంతాట ఆడుతున్నారు. విపక్ష సానుభూతిపరుల ఓట్లు గంపగుత్తగా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా అడుగులకు మడుగులొత్తే అధికారులు, వాలంటీర్లు సాయంతో దొంగ ఓట్ల దందాకు కుట్రపన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని, అధికారులను ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితం కాకుండా చూసుకోవాలి. ప్రజల విశ్వాసం పొందాలంటే అదే ఏకైక మార్గం అన్నది అంబేడ్కర్ మాట.
జగన్ చేసింది ఇది : జగన్ మాత్రం ప్రజల్ని కులాల వారీగా విభజించి పాలించారు. కొన్ని వర్గాల మీద నిత్యం విషం చిమ్మించి, విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రతీచోటా ఒకే సామాజికవర్గానికి పెద్దపీటేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్నీ అయినవారితోనే నింపేసి నిరంకుశ అధికారాన్నిచెలాయించారు.
-------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ప్రజల స్వేచ్ఛను రక్షించాలి. అది జరగాలంటే.. సమాజంలోని గూండాలు, నేరవర్గాల పీఛమణచాలి అన్నది బాబాసాహెబ్ భావన.
జగన్ చేసింది ఇది : కానీ జగన్ పాలనంటేనే రౌడీరాజ్యం. గూండా స్వామ్యం..! వైకాపా గూండాలకు ఏకంగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, ఇళ్ల మీద కర్రలు, రాడ్లతో దాడి చేసేంత అపరిమిత స్వేచ్ఛనిచ్చిన దుస్సాహసి జగన్. వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మానసికంగా, శారీరకంగా కుళ్లబొడుస్తున్నారు. అతిపెద్ద నేర ముఠాగా అవతరించిన అధికారపక్షానికి అరాచక పాలకుడిగా మిగిలిపోయారు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేడ్కర్ చెప్పిందేమిటి?
ఒక వర్గం ప్రజలను అణగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. అసమానతలు, వివక్షలను పారదోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే ఆదర్శంగా ప్రజాపాలన సాగాల్నది అంబేడ్కర్ ఆకాంక్ష.
జగన్ చేసింది ఇది : కానీ జగన్ చేసిందేంటి? వైసీపీ నాయకులే దళితులపై దమనకాండకు దిగినా, నోరెత్తని నయా నీరో జగన్! కొవిడ్ సమయంలో మాస్కుల్లేవని ప్రశ్నించిన దళితడాక్టర్ సుధాకర్ చావుకళ్లజూశారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఈగవాలనీయకుండా చూసుకుంటున్నారు. వైకాపా నేతల వేధింపులు, పోలీస్ చిత్రహింసలు తట్టుకోలేక అభాగ్య దళితులు, మైనార్టీలూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే జాలిదయలేని నిర్దయగుణం జగన్‌ది. దళితులపైనే ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోగించేతెంపరితనం.. జగన్‌కే సాధ్యం!
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇలా అంబేడ్కర్ అశయాలకు అడుగడుగునా తూట్లుపొడిచిన జగన్‌కు ఆ మహనీయుడి విగ్రహాన్ని తాకే అర్హతుందా? ఓవైపు ఆకాశమంత విగ్రహం పెట్టి అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నామని ఫోజులు కడుతూ మరోవైపు విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించి, జగన్ పేరు తగిలించుకోవడం బరితెగింపు కాదా? ఇది రాజ్యాంగ నిర్మాతను ఆకాశానికికెత్తడమా? అవమానించడమా? నక్క ఎక్కడ! నాగలోకం ఎక్కడ!
జగనన్న మార్క్ మోసం- నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే సంక్షేమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తూట్లు
మూడేళ్లలో ఏపీ జైళ్లలో పెరిగిన దళితుల సంఖ్య- నేరం చేశారో, లేదో తేలకుండానే మగ్గుతున్నారు
CBN: జగన్ దళిత ద్రోహి.. ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కాడా..? : చంద్రబాబు