ETV Bharat / bharat

అంగన్​వాడీ సిబ్బంది నిర్లక్ష్యం.. టాయిలెట్​లోనే ఏడ్చుకుంటూ బాలుడు.. చివరకు - కర్ణాటక కోలార్ న్యూస్

టాయిలెట్​లో ఉన్న బాలుడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు అంగన్​వాడీ సిబ్బంది. దీంతో బాలుడు మరుగుదొడ్డిలోనే కొన్ని గంటలపాటు ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. ఆఖరికి బాలుడి తల్లిదండ్రులు గమనించి అతడిని బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

Etv BharatChild Locked In Anganwadi Toilet teacher and helper recommended for dismiss

author img

By

Published : Sep 16, 2022, 10:06 AM IST

అంగన్​వాడీ సిబ్బంది నిర్లక్ష్యం.. గంటలపాటు టాయిలెట్​లో బాలుడు

కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. అంగన్​వాడీ టీచర్, సహాయకురాలు ఓ బాలుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంగన్​వాడీకి వచ్చిన ఓ బాలుడ్ని టాయిలెట్​లో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. బాలుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్​వాడీ సిబ్బందిని .. విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

అసలేం జరిగిందంటే.. కోలార్​ జిల్లాలోని హరోహళ్లిలోని అంగన్​వాడీలో టీచర్​గా సుధ, హెల్పర్​గా శారద పనిచేస్తున్నారు. అంగన్​వాడీకి వచ్చిన ఓ బాలుడు ఇంటికి వచ్చే ముందు టాయిలెట్​కు వెళ్లాడు. కానీ టీచర్, హెల్పర్ అది గమనించకపోవడం వల్ల టాయిలెట్​కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే బాలుడి కోసం అతని తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. ఎంతకీ బాలుడు కనిపించలేదు. ఆఖరికి అంగన్​వాడీ వద్దకు వచ్చి వెతికారు. బాలుడి ఏడుపు వినిపించింది. వెంటనే తలుపు తీసి టాయిలెట్​ నుంచి తమ బిడ్డను బయటకు తీశారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అంగన్​వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలుడు కొన్ని గంటలపాటు టాయిలెట్​లోనే ఉండిపోయాడు. అంగన్‌వాడీ సిబ్బంది బాధ్యతారాహిత్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారుపేట సీడీపీఓ మునిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇవీ చదవండి: 'సోవా'తో సొమ్మంతా స్వాహా.. భారత్​కు కొత్త మొబైల్​ వైరస్​ ముప్పు!

సీయూఈటీ-యూజీ ఫలితాలు వచ్చేశాయి.. మీ ర్యాంకు​ చూసుకున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.