ETV Bharat / bharat

'ఆ బార్​ అండ్ రెస్టారెంట్లలో చికెన్​కు బదులు పావురం బిర్యానీ.. ఇవిగో సాక్ష్యాలు!' - ముంబయి పావురం బిర్యానీ లేటెస్ట్ న్యూస్

ఓ వ్యక్తి పావురాలను పెంచి బార్ అండ్ రెస్టారెంట్​లకు అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయా చోట్ల చికెన్​కు బదులు పావురం మాంసంతో బిర్యానీ వండి వడ్డిస్తున్నారంటూ విశ్రాంత సైనికాధికారి ఒకరు ఆరోపించారు. ముంబయి పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

chicken-biryani-could-actually-be-pigeon-biryani- in-mumbai
చికెన్ బిర్యానీ పేరుతో పావురం మాంసంతో బిర్యానీ
author img

By

Published : Nov 28, 2022, 4:14 PM IST

బాలీవుడ్​లో సినిమా 'రన్'లోని ఓ సీన్​లో తక్కువ ధరకు చికెన్​ బిర్యానీ వచ్చిందని కొనుక్కుని తింటాడో వ్యక్తి. కానీ తరువాత ఆయనకు తెలుస్తుంది అది కాకి బిర్యానీ అని. ఇలాంటి తతంగమే నిజజీవితంలో జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ముంబయిలో చికెన్ బిర్యానీ పేరుతో పావురం మాంసంతో బిర్యానీ చేసి అమ్ముతున్నారని ఓ విశ్రాంత సైనికాధికారి ఆరోపించారు. అందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సమర్పించారు.

సియోన్​ ఠాణా పరిధిలో అభిషేక్ సావంత్ పావురాలను పెంచి బార్​, రెస్టారెంట్స్​లో అమ్ముతున్నాడని రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ హరీశ్(71) పోలీసులకు ఫిర్యాదు చేశారు. "అభిషేక్ అనే వ్యక్తి అపార్ట్​మెంట్​పై పావురాలను పెంచుతున్నాడు. తన డ్రైవర్ సహాయంతో వాటిని ముంబయిలోని బార్​, రెస్టారెంట్స్​కు అమ్ముతున్నాడు. అపార్ట్​మెంట్​ సోసైటీ వాచ్​మ్యాన్ ఆ పావురాలకు నీళ్లు పోసేందుకు వెళ్లేవాడు. ఈ విషయాన్ని అపార్ట్​మెంట్​ సొసైటీలో కొంతమందికి చెప్పాడు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు" అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు హరీశ్.

హరీశ్​ ఫిర్యాదుతో పోలీసులు అపార్ట్​మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సొసైటీలో కొంతమందిపై ఐపీసీ సెక్షన్ 34, 429, 447 కింద కేసులు పెట్టారు. అయితే ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. అసలు హరీశ్​ చెప్పిన విషయాలు నిజమా కాదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.