ETV Bharat / bharat

21 ఏళ్లుగా గడ్డం పెంచిన వ్యక్తి.. ప్రభుత్వం ఆ పని చేయగానే క్లీన్ షేవ్ - ఛత్తీస్​గఢ్ మనేంద్రగఢ్ న్యూస్

కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి దశాబ్దాలపాటు పోరాటం చేశాడు. తన కోరిక నెరవేరే వరకు గడ్డం తీయనని శపథం చేశాడు. తాజాగా ఆయన కోరిక తీరగా.. 21 ఏళ్ల తర్వాత గడ్డాన్ని తొలగించాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 11, 2022, 2:09 PM IST

21 ఏళ్లుగా గడ్డం పెంచిన వ్యక్తి

ఛత్తీస్​గఢ్​లో ఓ వ్యక్తి 21 ఏళ్లపాటు గడ్డం తీయలేదు. కొత్త జిల్లా ఏర్పడే వరకు గడ్డం తీయనని శపథం చేశాడు. కొరియా జిల్లా నుంచి వేరుచేసి మనేంద్రగఢ్-చిర్మిరి-భారత్‌పుర్​(ఎంసీబీ)ను కొత్త జిల్లాగా ప్రకటించడం వల్ల రామశంకర్ గుప్తా అనే వ్యక్తి శుక్రవారం.. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. ఛత్తీస్​గఢ్ ప్రభుత్వం ఎంసీబీను 32వ జిల్లాగా ఏర్పాటు చేసింది.

అసలేం జరిగిందంటే.. రామశంకర్​ గుప్తా.. మనేంద్రగఢ్​కు చెందిన వ్యక్తి. అతడు ఆర్టీఐ కార్యకర్త. మనేంద్రగఢ్-చిల్మరి-భరత్​పుర్​ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని గత 21 ఏళ్లుగా రామశంకర్ గడ్డం తీయలేదు. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఎంసీబీను కొత్త జిల్లాగా ప్రకటించింది. ఈ క్రమంలో రామశంకర్ తన గడ్డాన్ని తీశాడు. అయితే కొత్త జిల్లాగా అధికారికంగా ఏర్పాటయ్యేసరికి ఆలస్యమైంది. దీంతో మళ్లీ సంవత్సరం నుంచి గడ్డం పెంచాడు. తాజాగా రామశంకర్ కోరిక నెరవేరింది. దీంతో ఆయన శుక్రవారం తన గడ్డాన్ని క్లీన్ షేవ్ చేశాడు.

Chhattisgarh man shaves beard
.
Chhattisgarh man shaves beard
క్లీన్ షేవ్​ చేయించుకున్న రామశంకర్

మనేంద్రగఢ్‌-చిర్మిరి-భారత్‌పుర్‌ జిల్లాగా ఏర్పాటయ్యే వరకు గడ్డం తీయనని శపథం చేశా. జిల్లాగా మారకపోతే గడ్డం తీయకపోయేవాడిని. కొత్త జిల్లా ఏర్పాటు కోసం 40 ఏళ్లు పోరాటం చేశాను. కొత్త జిల్లా ఏర్పాటు కోసం చాలా మంది పోరాడారు. వారిలో కొందరు మరణించారు. కొత్త జిల్లా ఏర్పాటుతో వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​కు కృతజ్ఞతలు. దేశంలోనే మోడల్ జిల్లాగా ఎంసీబీ జిల్లా మారుతుందని అశిస్తున్నా.

--రామశంకర్ గుప్తా, ఆర్టీఐ కార్యకర్త

రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. మనేంద్రగఢ్​ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రం మనేంద్రగర్‌లో ఉండగా.. చిర్మిరిలోని 100 పడకల ఆస్పత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చారు. రూ.200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఇవీ చదవండి: జేఈఈ ఫలితాలు విడుదల.. టాపర్​గా శిశిర్

చెల్లి పెళ్లికి లీవ్ ఇవ్వలేదని ఆవేదన.. మతిస్తిమితం కోల్పోయి ఇంటికి దూరం.. మూడేళ్ల తర్వాత...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.