ETV Bharat / bharat

భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య... కిడ్నాప్ చేసి 4ఏళ్ల బాలికపై రేప్ - man kills wife with wooden cutting machine

Chennai man kills wife children: తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. ఇంటి యజమాని తన భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, రాజస్థాన్​లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

Chennai man kills wife children
Chennai man kills wife children
author img

By

Published : May 28, 2022, 6:24 PM IST

Chennai man kills wife children: తమిళనాడులో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఓ వ్యక్తితో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను చెన్నై సబర్బన్‌ పొలిచలూరులోని ఓ ఇంట్లో పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఇంటి యజమాని ప్రకాశ్(41) తొలుత తన భార్య గాయత్రితో పాటు పిల్లలను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కలపను కోసే యంత్రంతో వీరిని చంపేశాడని తెలుస్తోంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల కారణంగానే అతడు ముందుగా ముగ్గురిని చంపేసి.. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Chennai man kills wife, two children
గాయత్రి, ప్రకాశ్

Delhi man shot dead: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుండగా.. మధ్యలో కలగజేసుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దిల్లీలోని అంబేడ్కర్ నగర్​లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. డ్రింక్స్ విషయమై నయీమ్, గోపాల్ అనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో రోహిత్ (27) గొడవలో కలగజేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రోహిత్ అన్నయ్య గుల్షన్ (30) సైతం ఘటనాస్థలికి వెళ్లాడు. అప్పుడే సుమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో రోహిత్, గుల్షన్ గాయపడ్డారు. వీరిద్దరినీ ఎయిమ్స్ ట్రామా సెంటర్​కు తరలించగా.. గుల్షన్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రోహిత్​కు చికిత్స కొనసాగుతోంది. నిందితుడు సుమిత్​పై (24) ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గోపాల్, సాహిల్ అనే మరో ఇద్దరికి సైతం ప్రమేయం ఉందని చెప్పారు.

West Bengal father killed son: బంగాల్​లో కన్నకొడుకునే హత్య చేశాడు ఓ వ్యక్తి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఆరేళ్ల తమ కుమారుడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి వెతకడం ప్రారంభించారు. ఓ నీటి కుంట వద్ద అతడి శవాన్ని గుర్తించారు. కుమారుడిని వెతకడంలో నిర్లక్ష్యం వహించిన తండ్రి.. కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. అనంతరం కొద్దిసేపటికి అతడు పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడికి తన భార్యతో వైవాహిక సంబంధాలు సరిగా లేవని, కుమారుడితో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

UP Girl rape suicide: ఉత్తర్​ప్రదేశ్​లో​ అత్యాచారానికి గురైన 15ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. రాంపుర్ జిల్లా సైఫ్​నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం పక్కింట్లో ఉండే 17ఏళ్ల అబ్బాయి.. తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో అత్యాచారం చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వివాహం చేసుకోవాలని బాలుడి తల్లిదండ్రులను కోరారు. ఇందుకు బాలుడి తల్లిదండ్రులు వారు ఒప్పుకోలేదు. దీంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడిని అరెస్టు చేశారు.

Doctor sexual harassing nurse: ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో ఓ వైద్యుడు.. నర్సుపై లైంగిక దాడి చేశాడు. బహేదీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్​లో పనిచేస్తున్న రామ్ కృష్ణ వర్మ అనే డాక్టర్.. విధుల్లో ఉన్న సమయంలో తనను లైంగికంగా వేధించాడని నర్సు ఆరోపించింది. తాను వారించినప్పటికీ వైద్యుడు వినిపించుకోలేదని వాపోయింది. భౌతికంగా దాడి చేశాడని తెలిపింది. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.

రాజస్థాన్​లో నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కరౌలీ జిల్లాలోని హిండౌన్ ప్రాంతంలో నివాసం ఉండే ఆ బాలికను.. నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకొని వెళ్లాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆమె గుడిసె వద్ద వదిలేసి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.