ETV Bharat / bharat

Chandrababu visited Gaddar's Family : 'పేద ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్​' - గద్దర్​కు నివాళులు అర్పించిన చంద్రబాబు

Chandrababu visited Gaddar's Family : గద్దర్​ను చూడగానే ఒక ప్రజా యుద్ధ నౌక గుర్తుకు వస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. నేడు గద్దర్​ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Chandrababu visited Gaddar house
Chandrababu visited Gaddar Residence
author img

By

Published : Aug 15, 2023, 2:34 PM IST

Chandrababu visited Gaddar's Family : 'పేద ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్​'

Chandrababu visited Gaddar's Family : తాను రాజకీయాల్లో ఉండి.. ప్రజా చైతన్యం కోసం పని చేస్తే.. గద్దర్​ ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పంథా ఎన్నుకొని కృషి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్​ అని కొనియాడారు. నేడు గద్దర్​ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి మాట్లాడారు.

గద్దర్​ను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక వ్యక్తి కాదు.. ఆయనొక వ్యవస్థ అని కొనియాడారు. అందరికీ ప్రజా చైతన్యం అనగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు గద్దర్​ అని తెలిపారు. నిరంతరం ప్రజల పోరాటంలోనే బతికిన వ్యక్తి గద్దర్​ అని.. ప్రాథమిక హక్కులు, పేదల హక్కుల రక్షణ కోసం ప్రత్యేక పంథాను ఎంచుకున్నారని వివరించారు.

Gaddar life : వెయ్యిడప్పులు, లక్షగొంతుల కలయిక

"ఈరోజు ప్రజా చైతన్యంలో ఎవరైనా గుర్తుకు వస్తారంటే.. చరిత్రలో మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి గద్దర్​. ఆయన పాట, చేసిన కృషి చూస్తే ఎక్కడికి పోయినా పేద వాళ్ల సమస్యల పైన, పేదల హక్కుల పైన రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్​. నిరంతరం పోరాటంలోనే బతికిన వ్యక్తి గద్దర్. నేను 40 ఏళ్లు ఆయన్ను చూశాను. మేము రాజకీయాల్లో ఉండి ప్రజల చైతన్యంపై పోరాడితే.. ఆయన పాటతో పేద ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఎన్నో పోరాటాలకు నాంది పలికారు. ఎన్నో ఆవిష్కరణలు చేశారు. తెలంగాణ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు." - నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

Chandrababu Paid Tributes To Gaddar : గద్దర్​ను చూడగానే ఒక ప్రజా యుద్ధనౌక గుర్తుకు వస్తోందని టీడీపీ అధినేత కొనియాడారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక నుంచి తమ కార్యాచరణ గద్దర్​ ఆశయాలను కొనసాగించేలా ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. తాను అనేక సార్లు గద్దర్​తో కలిసి పని చేశానని గుర్తు చేసుకున్నారు. చాలా ఉద్యమాల్లో కూడా కలిసి వెళ్లామన్నారు. కొందరు వ్యక్తులు గద్దర్​ విషయంలో కొన్ని అపోహలు సృష్టించారని మండిపడ్డారు.

AP leaders Condolence on Gaddar Death గద్దర్ మృతి పట్ల ఏపీ నేతల సంతాపం..

"గద్దర్​ తన పోరాటాలతో నాంది పలికారు. తెలంగాణ పోరాటంలో ఎంతో కృషి చేశారు. దేనికి భయపడని వ్యక్తి గద్దర్​. పోరాటాలే ప్రాణంలో బతికారు. ఆయన స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆయన త్యాగాల ఫలితమే లక్షల మంది అభిమానులను సంపాదించడం. తెలుగు జాతి మంచి ఉద్యమకారున్ని కోల్పోయింది. గద్దర్​ది పెద్ద వయసు కాదు. ఆయన మృతి చాలా బాధ, ఆవేదనను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని" టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leaders Condolence on Gaddar Death : 'గద్దర్​ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'

Tribute to Gaddar : 'తెలంగాణ ఉద్యమ గొంతుక మూగబోయింది'.. గద్దర్​కు ప్రముఖుల కన్నీటి వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.