Chandrababu Skill Development Case: స్కిల్ కుంభకోణం కేసులో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందం ద్వారా 371 కోట్లను చంద్రబాబు ఖాతాల్లోకి మళ్లించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ ఒప్పందంతోనే తెలుగుదేశం హయాంలో 2 లక్షల 13 వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 75 వేల మందికి ఉద్యోగాలు లభించాయనే వాస్తవాన్ని మాత్రం వైసీపీ ప్రభుత్వం బయట పెట్టడంలేదు. వాస్తవానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 6చోట్ల ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, వాటి పరిధిలో 36 శిక్షణ కేంద్రాలను గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేశారు.
No Corruption in AP Skill Development Program: సీమెన్స్ సంస్థ వాటికి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అందించకపోయి ఉంటే.. అప్పట్లో నాలుగేళ్లపాటు ఇంతమందికి ఎలా శిక్షణ ఇచ్చారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇప్పుడీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అన్నీ ప్రభుత్వానికి సొంతమయ్యాయి. అలాంటప్పుడు ఇదెలా దోపిడీ అవుతుందో వైసీపీ ప్రభుత్వమే తెలపాలి. ఒప్పందంలో భాగంగా సీమెన్స్ సంస్థ సాఫ్ట్‌వేర్, ఇతర పరికరాల్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన 6 ఎక్స్‌లెన్స్ కేంద్రాలకు అందించింది.
Chandrababu Arrest in Skill Development Scam: అక్కడ పనిచేసే వారికి శిక్షణ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 3వేల 300 కోట్లు. ఎక్స్‌లెన్స్ కేంద్రాలను పరిశీలించిన కేంద్ర టూల్స్, డిజైన్ సంస్థ కూడా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఉన్నాయని ధ్రువీకరించింది. వాటి విలువను కూడా నిర్ధారించింది. ఒప్పందం పూర్తయ్యాక ఇవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. ఎక్స్‌లెన్స్ కేంద్రాల్లో ఇచ్చే 5 వారాల శిక్షణ.. బయట తీసుకోవాలంటే ఒక్కొక్కరికీ 25వేల పైనే ఖర్చవుతుంది. టీడీపీ హయాంలో మొత్తం 2 లక్షల 13 లక్షల మందికి ఉచితంగా శిక్షణ అందించారు.
Chandrababu Skill Development Case: సీమెన్స్ సంస్థ ఆయా కేంద్రాలకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంచకపోతే వీరందరికీ శిక్షణ ఇవ్వడం సాధ్యమయ్యేదా? మరి నిధులు దారిమళ్లిందెక్కడ? అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 340 కోట్లను చూసుకున్నా.. నాలుగేళ్లలో ఒక్కో విద్యార్థి శిక్షణపై 15వేలకు పైగా ఖర్చు చేసినట్లవుతుంది. పైగా ఎక్స్‌లెన్స్ కేంద్రాల్లోని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను రాబోయే సంవత్సరాల్లోనూ వినియోగించుకోవచ్చు. వాటిద్వారా లక్షలమందికి శిక్షణ ఇవ్వవచ్చు. ఈ అంశాలను అటు ప్రభుత్వం కానీ, ఇటు సీఐడీ కానీ ఎక్కడా తమ నివేదికల్లో బయట పెట్టడం లేదు.
I Am with Babu Song on Chandrababu Naidu: ఐయామ్ విత్ బాబు..'పోరాట సింహం' చంద్రబాబుకు సంఘీభావం
TDP Chandrababu Skill Development Program: ఎక్స్‌లెన్స్, నైపుణ్య శిక్షణ కేంద్రాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. సీమెన్స్ ప్రాజెక్టు కింద ఏర్పాటైన కేంద్రాలను గుర్తించి శిక్షణ తీరును పరిశీలించాలని ఆదేశించింది. ప్రాజెక్టు అమలు కమిటీలో మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌శాఖ కార్యదర్శి గంటా సుబ్బారావు, సాంకేతిక విద్య, కాలేజి విద్య కమిషనర్ ఉదయలక్ష్మి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణ, సీమెన్స్ నుంచి ప్రకాశ్ తొలాని, డిజైన్‌టెక్ నుంచి సచిన్ చోగులే ఉన్నారు.
CBN Skill Development Case: 15 రోజులకోసారి ప్రాజెక్టు అమలును పర్యవేక్షించి నెలవారీ సమీక్షలో ముఖ్యమంత్రికి నివేదించే బాధ్యతను కమిటీకి అప్పగించారు. కేంద్రాల ఎంపిక కమిటీలో అజయ్‌జైన్, ఎస్‌ఎస్ రావత్, గంటా సుబ్బారావు, ఉదయలక్ష్మి, కె.లక్ష్మీనారాయణలను నియమించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఇడుపులపాయ ప్రాంతంలోనూ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతమైనా అక్కడ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ట్రిపుల్ ఐటీ ఏర్పాటుచేశారు.
CBN Arrest in Skill Development Scam: టీడీపీ ప్రభుత్వం అక్కడే ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చింది. దీనివల్ల అనేక మంది ఉద్యోగ అవకాశాలు పొందారు. దీంతోపాటు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, గుంటూరులోని వీవీఐటీ, విజయవాడ పీబీ సిద్ధార్థ, అనంతపురం జేఎన్టీయూ, తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు.. పలుచోట్ల ఉద్రిక్తత