ETV Bharat / bharat

సీడీఎస్​ రావత్​ చాపర్​ క్రాష్​కు​ కారణం ఇదే.. వాయుసేనకు కీలక నివేదిక!

CDS Chopper Crash Reason: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ కుప్పకూలడంపై త్రివిధ దళాల సంయుక్త విచారణ పూర్తయింది. సంబంధిత కమిటీ.. వాయుసేనకు ప్రాథమిక నివేదిక సమర్పించింది.

CDS Bipin Rawat chopper crash
CDS Bipin Rawat chopper crash
author img

By

Published : Jan 14, 2022, 7:14 PM IST

Updated : Jan 14, 2022, 8:07 PM IST

CDS Chopper Crash Reason: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి యాంత్రిక వైఫల్యం, కుట్ర, నిర్లక్ష్యం కాదని స్పష్టమైంది. 2021 డిసెంబర్ 8న జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కోసం త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వాయుసేన ఏర్పాటు చేసిన కమిటీ ఈమేరకు ప్రాథమిక నివేదిక అందజేసింది. ఫ్లైట్ డేటా రికార్డర్​ను విశ్లేషించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Tamil Nadu Helicopter crash enquiry

వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల చాపర్​ అకస్మాత్తుగా మేఘాల్లోకి ప్రవేశించిందని ఆ కమిటీ తన నివేదికలో వివరించింది. ఫలితంగా కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్​ ఇబ్బంది పడ్డారని పేర్కొంది. తద్వారా అప్పటివరకు నియంత్రణలో ఉన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని తెలిపింది.

ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటామని వాయుసేన స్పష్టం చేసింది.

ఘోర ప్రమాదం..

తమిళనాడులోని కూనూర్​ సమీపంలో 2021 డిసెంబర్​ 8న జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి: శబరిమల 'మకరజ్యోతి' దర్శనం- భక్తజనం పరవశం

Last Updated : Jan 14, 2022, 8:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.