ETV Bharat / bharat

Cabinet Approves Fertilisers Subsidy : రైతులకు శుభవార్త.. ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం - 2023 రబీ సీజన్ ఎరువుల సబ్సిడీ

Cabinet Approves Fertilisers Subsidy : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్​లో వివిధ రకాల ఎరులపై సబ్సిడీకి రూ.22,303 కోట్ల విడుదలకు మంత్రివర్గం​ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ వివరాలు వెల్లడించారు.

Cabinet Approves Fertilisers Subsidy
Cabinet Approves Fertilisers Subsidy
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 3:59 PM IST

Updated : Oct 25, 2023, 5:28 PM IST

Cabinet Approves Fertilisers Subsidy : రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రబీ పంట సీజన్​లో (2023 అక్టోబర్ 1 - 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ.. రైతులు మాత్రం డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఎరువును బస్తాకు పాత ధర రూ.1,350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ వివరాలు వెల్లడించారు.

తాజా నిర్ణయంతో కిలో నత్రజనిపై రూ.47.2, కిలో ఫాస్ఫరస్​పై రు. 20.82, కిలో పొటాష్​పై రూ.2.38, కిలో సల్ఫర్​పై రూ.1.89 సబ్సిడీ లభించనుంది. ఇక టన్ను డీఏపీకి రూ.4500 సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం. ఎన్‌పీకే ఎరువు బస్తా రాయితీ ధర రూ.1470 లభించనుంది.

రైతులకు సులభంగా, అందుబాటు ధరలో ఎరువులు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ (మ్యూరియెట్​ ఆఫ్​ పొటాష్), సల్ఫర్​ వంచి ఎరువుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రైతులకు తక్కువ ధరలో ఎరువులు లభ్యమయ్యేలా.. ఆమోదించిన రేట్ల సబ్సిడీని ఎరువుల తయారీ కంపెనీలకు చెల్లిస్తామని వెల్లడించింది.

  • #WATCH | Union Minister Anurag Thakur says, "Subsidy for the Rabi season from 1st October 2023 till 31st March 2024 will be like this. For the nitrogen, it will be Rs 47.2 per Kg, phosphorus will be Rs 20.82 per Kg, potash subsidy will be Rs 2.38 per Kg. And the Sulphur subsidy… pic.twitter.com/wRko0XNMKF

    — ANI (@ANI) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు..
2024-2025 రబీ మార్కెటింగ్‌ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచడానికి కేంద్ర మంత్రిమండలి ఇటీవల (అక్టోబర్ 18) పచ్చజెండా ఊపింది. క్వింటా గోధుమకు రూ.150 పెంపును ఖరారు చేశారు. బార్లీపై రూ.115, పై రూ.105 పెంచారు. పొద్దుతిరుగుడుకు రూ.150, ఆవాలకు రూ.200 పెంపు నిర్ణయించారు. కంది పప్పు క్వింటాకు రూ.425 పెంచారు. ఈ నిర్ణయంతో క్వింటా గోధుమల ధర రూ.2275 చేరగా.. బార్లీ రూ.1850, శనగలు రూ.5440, పొద్దుతిరుగుడు రూ.5800, ఆవాలు రూ.5650, కంది పప్పు రూ.6425 పెరిగింది.

అందుబాటు ధరలకు ఎరువులు- కేంద్రం హామీ

రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు

Last Updated : Oct 25, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.