ETV Bharat / bharat

కేంద్రం గుడ్​ న్యూస్​.. వారికి ఉచితంగా డీడీ సెట్​-టాప్ బాక్సులు!

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే 8 లక్షల మందికి ఉచిత డీడీ సెట్​-టాప్ బాక్సులను అందించడానికి ఆమోదముద్ర వేసింది. దీనికి పాటుగా జాతీయ గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

cabinet meeting aproves
ప్రసార భారతి
author img

By

Published : Jan 4, 2023, 10:44 PM IST

సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. 8 లక్షల కుటుంబాలకు డీడీ ఉచిత సెట్-టాప్ బాక్స్‌ను ప్రభుత్వం అందించనుంది. దానికోసం అవసరమైన రూ.2539కోట్లను.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బిండ్) పథకం ద్వారా వారికి అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశంలో ప్రసార భారతి, ఆల్​ ఇండియా రేడియో, దూరదర్శన్​ కార్యక్రమాలు మరింత మందికి చేరువకానున్నాయి. దీంతో పాటుగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

బిండ్​ అనేది ప్రసార భారతి, ఆల్​ ఇండియా రేడియో, డీడీకి చేయాతనందించే పథకం. దీంతో పబ్లిక్​ బ్రాడ్​కాస్టింగ్​ పరిధిని పెంచి, మౌళిక సదుపాయలు కల్పించేందుకు వీలవుతుంది. ఈ పథకం దేశంలోని 80 శాతం మందికి ఆల్​ ఇండియా రేడియో సేవలు అందేలా చేస్తోంది.

గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..
జాతీయ గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ. 19,744 కోట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రూ.1,466 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం. గ్రీన్‌ హైడ్రోజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది.

గోవా ఎయిర్​పోర్టుకు పారికర్ పేరు
గోవాలోని మోపా విమానాశ్రయానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌'గా నామకరణం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రయాన్ని 2022 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆధునిక గోవాను నిర్మించడంలో దివంగత మనోహర్ పారికర్ చేసిన కృషికి గుర్తింపుగా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.