పాఠశాల విద్యార్థులను చూసి బస్సు ఆపలేదని కర్ణాటక ప్రాథమిక-ఉన్నత విద్యా శాఖ మంత్రి కే సురేష్ కుమార్.. అదే ఆర్టీసీ బస్సును వెంబడించి ఆపేశారు.
తుమకూరు జిల్లాలోని మధుగిరిని సందర్శించేందుకు వెళ్తున్న ఆయన.. రోడ్డు పక్కన పిల్లలు ఆగి ఉండటాన్ని గమనించారు. బస్సు ఆపాలని పిల్లలు చేయి చూపించి అడిగినా.. ఆగకుండా వెళ్లిపోవడాన్ని చూశారు. దీంతో బస్సును తన కాన్వాయ్‌తో వెంబడించి అడ్డగించారు. డ్రైవర్, కండక్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులను తప్పనిసరిగా ఎక్కించుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: వూలా ఛాయ్... జర దేఖో భాయ్!