ETV Bharat / bharat

పెళ్లికి అతిథులుగా ఎద్దులు.. స్పెషల్​గా స్టేజీ ఏర్పాటు.. ప్రేమను చాటుకున్న రైతు - కర్ణాటకాలో వినూత్న వివాహం

ఎద్దులపై తనకున్న ప్రేమను వినూత్నంగా చూపించాడు ఓ వ్యక్తి. తన పెళ్లి జరిగే హాల్​కు తీసుకురావడమే కాకుండా.. వాటికోసం ప్రత్యేకంగా ఒక స్టేజ్​ను ఏర్పాటు చేశాడు.

Bulls as wedding guests
పెళ్లికి అతిథులుగా ఎద్దులు
author img

By

Published : Dec 13, 2022, 12:42 PM IST

నిరంతరం పొలంలో పనిచేస్తూ జీవనాధారంగా ఉన్న ఎద్దులపై వినూత్నంగా ప్రేమను చూపాడు ఓ వ్యక్తి. తన పెళ్లికి వాటిని అతిథులుగా తీసుకువచ్చాడు. అంతే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఓ స్టేజీని ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లిలో ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

ఇదీ జరిగింది
చామరాజనగర్ జిల్లా నంజన్‌గూడు తాలూకా చిక్కహోమ్మా గ్రామానికి చెందిన మహేష్.. వృత్తి రీత్యా రైతు. అతడికి యోగిత అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం జరిగిన ఈ వేడుకకు తనకు వ్యవసాయంలో ఎంతో సాయం చేసిన రెండు ఎద్దులను ఫంక్షన్ హాల్​ వద్దకు తీసుకువచ్చాడు. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడు. వాటిని ఆకర్షనీయంగా ముస్తాబు చేశాడు. "మా అబ్బాయికి ఈ ఎద్దులంటే చాలా ఇష్టం. వీటి ధర రూ. రెండు లక్షల దాకా ఉంటుంది." అని వరుడి తండ్రి బసవరాజప్ప తెలిపారు. తన కోసం ఎంతో కష్టపడిన ఎద్దులపై యువకుడి చూపిన ప్రేమపై పలువురు ప్రశంసిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.