ETV Bharat / bharat

సెలవులు ఇస్తారని స్కూల్​కు బాంబు బెదిరింపులు.. ఆకతాయి విద్యార్థి అరెస్ట్ - కర్ణాటక బెంగళూరు లేటెస్ట్ న్యూస్

కర్ణాటకలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పాఠశాలలో బాంబు ఉందని పాఠశాలకు మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

bomb threat in school
పాఠశాలలో బాంబు కలకలం
author img

By

Published : Jan 7, 2023, 5:55 PM IST

కర్ణాటక బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. స్కూల్​లో బాంబు ఉందని ఓ విద్యార్థి మెసేజ్ పంపాడు. ఈ ఘటనలో ఐపీ అడ్రస్ ఆధారంగా ఆకతాయి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని రాష్ట్ర జువైనల్​ జస్టిస్ బోర్డుకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బసవేశ్వర్​ నగర్​లోని నేషనల్ పబ్లిక్ స్కూల్​కు మెయిల్​ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే పాఠశాల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పాఠశాలకు చేరుకున్న పోలీసులు దాదాపు 1,000 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకింత భయం మొదలైంది. పాఠశాల చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.

bomb threat in school
పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది

బాంబు స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​తో పోలీసులు పాఠశాల ఆవరణ అంతా తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు పోలీసులకు లభించలేదు. దీంతో ఇది ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆకతాయి విద్యార్థిని గుర్తించారు. స్కూల్​కు సెలవు వస్తే సరదాగా గడపవచ్చని ఇలా చేశానని పోలీసులకు తెలిపాడు. గూగుల్​లో సెర్చ్ చేసి స్కూల్​ అధికారిక మెయిల్​కు మెసేజ్​ పెట్టినట్లు విద్యార్థి పోలీసులు ఎదుట అంగీకరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.