ETV Bharat / bharat

500కుపైగా కేసులు.. రూ.84 లక్షల రివార్డ్​.. మావోయిస్టు అగ్రనేత అనుమానాస్పద మృతి!

Maoist sandeep yadav: బిహార్​లోని గయా జిల్లా లుటువా పోలీస్​ స్టేషన్​ పరిధిలో టాప్​ మావోయిస్టు లీడర్ సందీప్​ అలియాస్​ విజయ్​​ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సందీప్​పై 500కుపైగా కేసులు, రూ.84 లక్షల రివార్డు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Maoist sandeep yadav
సందీప్​ యాదవ్
author img

By

Published : May 26, 2022, 3:01 PM IST

Maoist sandeep yadav: మావోయిస్టు అగ్రనేత సందీప్​ అలియాస్​ విజయ్​.. బిహార్​లోని గయా జిల్లా లుటువా పోలీస్​ ఠాణా పరిధిలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సందీప్​పై విష ప్రయోగం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. బాబురామ్​ దేహ్​ గ్రామానికి చెందిన 55 ఏళ్ల సందీప్​.. బిహార్​, ఝార్ఖండ్​, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, బంగాల్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో నక్సల్స్​ జరిపే అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు.

Maoist sandeep yadav
మావోయిస్టు నేత సందీప్​ యాదవ్​ అలియాస్​ విజయ్​

సందీప్​పై ఇప్పటికే వివిధ నేరారోపణల కింద 500కుపైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో కేవలం బిహార్​ రాష్ట్రంలోనే 100కుపైగా నమోదయ్యాయి. సందీప్​పై​ వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రివార్డుల మొత్తం రూ.84 లక్షలకు చేరింది. ఈ మృతిపై స్పందించిన అధికారులు.. 'అనారోగ్యం కారణంగా మృతిచెందినట్లు రిపోర్టులు ఉన్నాయి. కానీ ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేపడతాం. ఎవరైనా విష ప్రయోగం చేసి హత్య చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం' అని పేర్కొన్నారు.

2018లో సందీప్​ యాదవ్​పై చర్యలు చేపట్టిన ఈడీ.. రూ.86 లక్షలు విలువైన స్థిరాస్తి, చరాస్తులను సీజ్​ చేసిందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా వారు స్వాధీనం చేసుకున్న ఓ ప్లాట్​, ఫ్లాట్​ల ధరే రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. బిహార్​లోని గయా, ఔరంగాబాద్​ జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహించి చర్యలు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి : కాంగ్రెస్​ నేతలపై సీబీఐ.. శివసైనికులపై ఈడీ.. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.