ETV Bharat / bharat

యమునా నది పడవ మునక ఘటనలో 11కు చేరిన మృతులు - యమునా నదిలో పడవ ప్రమాదం

yamuna boat tragedy ఉత్తర్​ప్రదేశ్ బాందా జిల్లాలోని యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు.

banda boat accident news update
banda boat accident news update
author img

By

Published : Aug 13, 2022, 12:49 PM IST

yamuna boat tragedy యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉత్తర్​ప్రదేశ్ బాందా జిల్లాలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు.

banda boat accident news update
ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు

మర్కా నుంచి ఫతేపుర్​లో ఉన్న జరౌలీ ఘాట్​కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది. పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేశారు. అదనపు ఎస్పీ లక్ష్మీ నివాస్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఏడెనిమిది మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చేశారని.. మిగతా వారంతా మునిగిపోయారన్నారు.

సీఎం యోగి విచారం: ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ప్రకటించారు. స్థానిక ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి: చెన్నై ఎయిర్​పోర్ట్​లో రూ100కోట్ల డ్రగ్స్ షూలు దుస్తుల్లో తరలింపు

Har Ghar Tiranga అమిత్ షా ఇంటిపై జాతీయ జెండా హిమాలయాలు త్రివర్ణశోభితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.