ETV Bharat / bharat

హైదరాబాద్​లో భాజపా కీలక సమావేశాలు.. ఆ 160 లోక్​సభ స్థానాల గెలుపే లక్ష్యంగా! - హైదరాబాద్‌లలో విస్తారక్‌ సభలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై గురిపెట్టింది భాజపా. మొన్నటి వరకు కష్టమైన లోక్​సభ స్థానాల సంఖ్య 144 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి చేరింది. ఈ క్రమంలోనే పట్నా, హైదరాబాద్​లలో విస్తారక్​ల సమావేశాలను నిర్వహించనుంది.

bjp raises difficult lok sabha seats
2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భాజపా
author img

By

Published : Dec 20, 2022, 8:05 AM IST

Updated : Dec 20, 2022, 8:20 AM IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కష్టమైన లోక్‌సభ స్థానాల సంఖ్యను కమలనాథులు 160కి పెంచుకున్నారు. ఇప్పటివరకు వాటి సంఖ్య 144గా ఉండేది. కొత్తగా ఆ జాబితాలో చేరిన సీట్లలో అత్యధికం బిహార్‌కు చెందినవే. జేడీయూతో తెగదెంపుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భాజపా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుండటమే అందుకు కారణం. ఈ జాబితాలోని నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమితులైన కమలదళం వ్యవస్థాగత నేతలు (విస్తారక్‌లు) పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో దిల్లీలో సోమవారం సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై వారంతా చర్చించారు.

బిహార్‌ రాజధాని పట్నా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లలో విస్తారక్‌లకు రెండు రోజుల చొప్పున శిక్షణ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పట్నాలో ఈ నెల 21, 22 తేదీల్లో.. హైదరాబాద్‌లో 28, 29 తేదీల్లో సంబంధిత సమావేశాలు జరిగే అవకాశముంది. బిహార్‌లో జరిగే సమావేశంలో 90 సీట్లపై, హైదరాబాద్‌ సదస్సులో మిగిలిన 70 స్థానాలపై భాజపా నేతలు సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ సహా వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌ వంటి కీలక నేతలు వాటికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

Last Updated : Dec 20, 2022, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.