ETV Bharat / bharat

సోమవారమే సీఎంగా భూపేంద్ర ప్రమాణస్వీకారం - భాజపా నేత

గుజరాత్​ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్​ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​. ఆదివారం గవర్నర్​ను కలవనున్నట్లు స్పష్టం చేశారు.

BJP MLA Bhupendra Patel
సీఎంగా భూపేంద్ర పటేల్
author img

By

Published : Sep 12, 2021, 6:15 PM IST

Updated : Sep 12, 2021, 6:46 PM IST

గుజరాత్ ముఖ్యమంత్రిగా భాజపా నేత భూపేంద్ర పటేల్​ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో భూపేంద్ర పటేల్​ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. విజయ్​ రూపానీ రాజీనామాతో ఏర్పడిన ఉత్కంఠకు తెరదించారు.

అయితే.. ఆయన ఒక్కరే సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​ తెలిపారు.

గవర్నర్​ను కలిసిన నేతలు

గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఎంపికైన క్రమంలో గాంధీ నగర్​లోని రాజ్​భవన్​లో గవర్నర్​ ఆచార్య దేవ్​రత్​ను కలిశారు భూపేంద్ర పటేల్​. ఆయనతో పాటు మాజీ సీఎం విజయ్​ రూపానీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​, పలువురు సీనియర్​ నేతలు నేతలు హాజరయ్యారు.

Bhupendra Patel
రాజ్​భవన్​లో నేతలు
Bhupendra Patel
గవర్నర్​కు లేఖ సమర్పిస్తున్న భాజపా నేతలు
Bhupendra Patel
గవర్నర్​తో భూపేంద్ర పటేల్​
Bhupendra Patel
గవర్నర్​తో భూపేంద్ర పటేల్​, విజయ్​ రూపానీ

పటేల్​పై రూపానీ ప్రశంసలు..

భూపేంద్ర పటేల్​ సీఎం పదవికి సమర్థుడని కొనియాడారు మాజీ సీఎం విజయ్​ రూపానీ. ఆయన నాయకత్వంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు.

షా శుభాకాంక్షలు..

గుజరాత్​ భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన భూపేంద్ర పటేల్​కు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్​ షా. ప్రధాని మోదీ మార్గదర్శకంలో రాష్ట్ర అభివృద్ధి మరింత ముందుకు వెళుతుందని, ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉందన్నారు.

Last Updated : Sep 12, 2021, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.