ETV Bharat / bharat

ఒక్క వీడియోతో​ ఓవర్​నైట్​ స్టార్​​గా క్యాటరింగ్ బాయ్​​​.. అమర్​కు బాలీవుడ్​ నటి ఆఫర్​! - బాలీవుడ్​ నటి నీతూచంద్ర ట్వీట్​ సింగర్​

సోషల్ ​మీడియాలో పోస్ట్​ చేసిన ఓ వీడియో వల్ల బిహార్​కు చెందిన ఓ యువకుడు రాత్రికిరాత్రే స్టార్​ సింగర్​గా మారిపోయాడు! పలువురు బాలీవుడ్​ ప్రముఖులు.. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి కాంటాక్ట్​ నంబర్ తెలుసుకుని బాలీవుడ్​ నటి నీతూచంద్ర మాట్లాడి ఆఫర్​ కూడా ఇచ్చారు. ఓసారి ఆ యువకుడి గురించి తెలుసుకుందాం.

bihar young boy amarjeet jaikar singer who became overnightsensation

author img

By

Published : Feb 24, 2023, 7:25 PM IST

ప్రస్తుత రోజుల్లో సోషల్​ మీడియా.. ప్రతిభావంతులకు ముఖ్య వేదికగా మారింది. వివిధ రంగాల్లో టాలెంట్​​ ఉన్న అనేకమంది వ్యక్తులు.. సోషల్​ మీడియా ద్వారానే వెలుగులోకి వస్తున్నారు. కొందరు ట్రెండింగ్​లో ఉన్న పాటలకు డ్యాన్స్​ చేసి వీడియోలు పోస్ట్​ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. దాంతో పాటు అవకాశాలను చేజిక్కుంచుకుంటున్నారు. మరికొందరు తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి వీడియోలను షేర్​ చేస్తున్నారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్​గా మారి ఫేమస్​ అవుతున్నారు. బిహార్​కు చెందిన అమర్​జీత్​ జైకర్​ అనే యువకుడు కూడా ఆ కోవకు చెందినవాడే. రాత్రికి రాత్రే స్టార్​ సింగర్​గా​ మారిపోయాడు!

సమస్తిపుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని షాపుర్​ పటోరి భభూవ గ్రామమే అమర్​జీత్​ స్వస్థలం. చదువుకుంటూ.. స్థానికంగా జరిగే పెళ్లిళ్లకు క్యాటరింగ్​ బాయ్​గా పనిచేసేందుకు అమర్​జీత్​ వెళ్లేవాడు. అలా మెల్లమెల్లగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత.. క్యాటరింగ్​ బాయ్​గా కాకుండా వివాహ వేడుకల్లో పాటలు పాడేవాడు. అనేక చోట్ల స్టేజీ షోలు కూడా ఇచ్చాడు. దాంతో పాటు అప్పుడప్పుడు తన సోషల్​ మీడియా ఖాతాల్లో తాను పాడిన వీడియోలను పోస్ట్​ చేసేవాడు. ఇటీవలే బాలీవుడ్​లో ఫేమస్​ అయిన 'దిల్​ దే దియా హై పా' పాట​ పాడిన వీడియోను షేర్​ చేశాడు. ఒక్కసారిగా ఆ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దీంతో అతడు ఓవర్​ నైట్​ స్టార్​గా మారిపోయాడు.

అయితే అమర్​జీత్​ వీడియో చూసిన కొందరు బాలీవుడ్​ ప్రముఖులు.. అతడిని ప్రశంసించారు. బీటౌన్​​ స్టార్​ హీరో సోనూసూద్​.. అమర్​జీత్​ వీడియోను రీషేర్​ చేశారు. సోనూసూద్​తో పాటు నటి నీతూచంద్ర.. అతడిపై ప్రశంసలు కురిపించారు. "ఈ వ్యక్తి ఎవరు? అద్భుతం. దయచేసి అతడి కాంటాక్ట్ నంబర్‌ను పంపండి." అంటూ ట్వీట్​ చేశారు.

"సోషల్​మీడియాలో ఒక్కసారిగా నా వీడియో వైరల్​ కావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా నాన్నకు చిన్న సెలూన్​ ఉంది. ప్రస్తుతం నేను చదువుకుంటున్నారు. చుట్టుపక్క గ్రామాల్లో స్టేజ్​ షోలు కూడా ఇస్తున్నాను. నేను పాడిన 'దిల్​ దే దియా హై పా' పాట వీడియో చూసి నటి నీతూచంద్ర కాల్​ చేశారు. త్వరలోనే ముంబయికి పిలిపిస్తానని ఆఫర్​ ఇచ్చారు."

-- అమర్​జీత్​

పుత్రోత్సాహంలో తల్లి..
సోషల్ ​మీడియాలో తన కుమారుడి వీడియో వైరల్​ కావడం పట్ల అమర్​జీత్​ తల్లి స్పందించింది. చాలా గర్వంగా ఉన్నట్లు తెలిపింది."నా కుమారుడు ఎక్కువగా పాటలు పాడుతూ ఉండడం వల్ల చాలా మంది పిచ్చివాడు అని అనేవారు. ఇప్పుడు రాత్రికిరాత్రే అమర్​జీత్​ ఫేమస్​ కావడం వల్లా వారంతా సంతోషంగా ఉన్నారు. నా కుమారుడు పెళ్లిళ్లలో క్యాటరింగ్​ బాయ్​గా పనిచేసేవాడు. కొంతకాలం తర్వాత స్టేజీ షోలు ఇవ్వడం ప్రారంభించాడు" అని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.