Father killed daughter: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతుర్ని గొంతు కోసి హత్య చేశాడు. ఈ విషయాన్ని మృతురాలి తల్లి పోలీసులకు వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
బిహార్ గోపాల్‌గంజ్‌లో ఉండే కిరణ్ కుమారి అనే 19 ఏళ్ల అమ్మాయి.. తన గ్రామంలో ఉండే ఓ యువకుడితో స్నేహపూరితంగా ఉండేంది. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. ఇది తెలుసుకున్న కుమారి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు. ఇందుకోసం మసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బిర్చా గ్రామానికి చెంది నాతి శర్మ అనే అబ్బాయితో పెళ్లి చేసేందుకు నిశ్చియించాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె తండ్రి ఇంద్రదేవ్ ఆదివారం మద్యం తాగి సోదరులతో కలిసి ఇంటికి వచ్చాడు.
అనంతరం కూతురు చేతులు, కాళ్లు కట్టేసి గొంతు కోసినట్లు అధికారులు మృతురాలి తల్లి కళావతి పోలీసులకు వివరించింది. దీనిని అడ్డుకోబోయినందుకు గానూ.. ఆమెపై కూడా నిందితులు దాడికి దిగినట్లు వివరించింది. కత్తితో గాయపరిచినట్లు పేర్కొంది.
ఈ రోజు ఉదయం స్థానికంగా.. ఉండే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కళావతి.. జరిగింది అంతా పోలీసులకు వివరించింది. ఆమె వాంగ్మూలంతో అధికారులు ఇంద్రదేవ్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేశారు. వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: