ETV Bharat / bharat

కూలీకి రూ.37.5లక్షల ఆదాయపు పన్ను నోటీసులు - 37 5 లక్షల ఆదాయపు పన్ను నోటీసులు

బిహార్​లో రోజువారీ కూలీకి రూ. 37.5లక్షలు కట్టాలని ఆదాయపు పన్ను నుంచి నోటీసులు అందాయి. ఒక్కసారిగా ఖంగుతిన్న బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

it notice
ఆదాయపు పన్ను నోటీసులు
author img

By

Published : Aug 21, 2022, 4:44 PM IST

కూలీ పనులు చేస్తూ రోజుకు రూ.500 సంపాదించే ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. బిహార్​లోని ఖగాడియా జిల్లా మఘౌనా గ్రామానికి చెందిన గిరీశ్ యాదవ్​కు.. తన పేరు మీద బకాయి పడిన రూ.37.5 లక్షలను వెంటనే చెల్లించాలని ఐటీ శాఖ ఆదేశించింది. దాన్ని చూసిన గిరీశ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దగ్గరలో ఉన్న అలౌలి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు స్టేషన్ హౌస్​ ఆఫీసర్​ పురేంద్ర కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారు పేరుపై ఉన్న పాన్ నంబర్‌ ద్వారా నోటీసు అందుకున్నట్లు చెప్పారు.

"గిరీశ్​ కుమార్ ఉపాధి కోసం దిల్లీలో చిన్నచిన్న పనులు చేస్తుంటానని చెప్పాడు. అక్కడే పాన్​ కార్డ్​ కోసం గతంలో ఓ మధ్యవర్తిని సంప్రదించాడు. కానీ ఆ మధ్యవర్తి తర్వాత ఎప్పుడూ తనను కలవలేదని గిరీశ్​ చెప్పాడు. రాజస్థాన్​లో ఓ కంపెనీతో గిరీశ్​కు సంబంధం ఉన్నట్లుగా ఐటీ శాఖ నోటీసుల్లో ఉంది. అసలు ఆ రాష్ట్రానికి తానెప్పుడూ వెళ్లలేదని అతడు అంటున్నాడు" అని చెప్పారు పురేంద్ర.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.