ETV Bharat / bharat

8 స్థానాల్లో భాజపా గెలుపు.. 4 సీట్లు కాంగ్రెస్​ కైవసం

author img

By

Published : Jun 19, 2020, 10:03 AM IST

Updated : Jun 20, 2020, 5:53 AM IST

RS
పెద్దల సభ

22:22 June 19

దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల మేరకు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 4 స్థానాలు గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు నాలుగు వైకాపా తన ఖాతాలో వేసుకుంది.

మధ్యప్రదేశ్‌లో భాజపా 2 స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించాయి. మధ్యప్రదేశ్‌లో భాజపా తరఫున జ్యోతిరాదిత్య సింధియా, సమీర్‌ సింగ్‌ సోలంకీ, కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ గెలుపొందారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ 2, భాజపా ఒక చోట గెలుపొందాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ తరఫున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, నీరజ్‌ దంగి, భాజపా తరఫున రాజేంద్ర గహ్లోత్‌  పెద్దలసభకు ఎన్నికయ్యారు. 

గుజరాత్​లో మూడు స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్​ ఒక సీటుతో సరిపెట్టుకుంది. 

ఝార్ఖండ్‌లో జేఎంఎం తరఫున శిబూ సోరెన్‌, సుమేర్‌సింగ్‌ గెలుపొందారు.

మేఘాలయలో ఎన్​పీపీ అభ్యర్థి డబ్ల్యూఆర్​ ఖర్లూఖి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్-4, గుజరాత్-4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్-3, ఝార్ఖండ్- 2, మణిపుర్, మిజోరాం, మేఘాలయలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఓటింగ్‌ జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

21:21 June 19

మణిపూర్ రాజ్యసభ సీటు భాజపా కైవసం

మణిపూర్​లో ఏకైక రాజ్యసభ స్థానాన్ని భాజపా చేజిక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి టి.మంగిబాబును భాజపా అభ్యర్థి లీసెంబా సనాజోబా 28 ఓట్ల తేడాతో ఓడించారు.

21:04 June 19

మేఘాలయ: రాజ్యసభ సభ్యునిగా ఖర్లూఖి ఎన్నిక

20:07 June 19

దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల మేరకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ చెరో 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో  4 స్థానాలకు నాలుగు వైకాపా తన ఖాతాలో వేసుకుంది.

ఝార్ఖండ్‌లో జేఎంఎం తరఫున శిబూ సోరెన్‌, సుమేర్‌సింగ్‌ గెలుపొందారు. గుజరాత్‌లో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేల ఓటింగ్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయటం వల్ల ఫలితాలు ఆలస్యం కానున్నాయి. 

18:58 June 19

రాజ్యసభ స్థానాలకు వెలువడిన ఫలితాలు

  1. ఏపీలో వైకాపాకు చెందిన నలుగురు రాజ్యసభ అభ్యర్థులు విజయం
  2. రాజస్థాన్‌లో ఇద్దరు కాంగ్రెస్‌, ఒక భాజపా రాజ్యసభ అభ్యర్థి విజయకేతనం
  3. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు భాజపా, ఒక కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి గెలుపు
  4. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

18:37 June 19

మధ్యప్రదేశ్​లో...

మధ్యప్రదేశ్​లో భాజపా 2 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్​ ఒక స్థానాన్ని దక్కించుకుంది.

18:35 June 19

రాజస్థాన్​లో...

రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్​లో కాంగ్రెస్​ 2 స్థానాలను గెలుపొందగా.. భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

09:52 June 19

రాజ్యసభ స్థానాలకు పోలింగ్​

దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. శాసనసభ్యులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

19 స్థానాలు ఇవే..

గుజరాత్​-4, ఆంధ్రప్రదేశ్​-4, రాజస్థాన్​-3, మధ్యప్రదేశ్​-3, ఝార్ఖండ్​-2, మణిపుర్​, మిజోరాం, మేఘాలయల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 19 స్థానాలకు మార్చి 26నే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డాయి.

కొన్ని రాష్ట్రాల్లో పార్టీల మధ్య పోటీ తీవ్రస్థాయిలోనే ఉంది. కర్ణాటకలో నాలుగు సీట్లు ఇప్పటికే ఏకగ్రీవమవగా.. ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్​, గుజరాత్​లో ఇప్పటికే రిసార్టు రాజకీయాలు నడిచాయి. తమ అభ్యర్థులను పెద్దలసభలో అడుగు పెట్టించేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి.

ఇవే కీలకం...

పార్లమెంటు ఎగువసభలోని మొత్తం 245 స్థానాల్లో.. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు ప్రస్తుతం 106 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు 118 సీట్లతో ముందంజలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏవి 57 స్థానాలు కాగా.. ఇతర పార్టీలవి 61 సీట్లు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులు పార్లమెంటులో గట్టెక్కాలంటే.. సదరు బిల్లులు ఉభయసభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. లోక్​సభలో సొంతంగానే పూర్తి మెజారిటీ ఉన్న భాజపాకు.. రాజ్యసభలో మాత్రం బిల్లులను గట్టెక్కించాలంటే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అవుతోంది. అందుకే జూన్​ 19న 19 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు సొంతం చేసుకుని రాజ్యసభలోనూ తమ మద్దతు పెంచుకోవాలని చూస్తోంది కమలదళం.

Last Updated : Jun 20, 2020, 5:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.