ETV Bharat / bharat

దేశంలో 24 గంటల్లో 73 మంది కరోనాతో మృతి - కరోనా లేటెస్ట్​ న్యూస్​

భారత్​లో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో 73 మంది మరణించడం వైరస్​ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు దేశంలో ఒక్కరోజు వ్యవధిలో ఇంతమంది మరణించలేదని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం మరణాలు 1007కు చేరాయి.

total-number-of-number-covid19-positive-cases-in-india
దేశంలో విజృంభిస్తున్న కరోనా
author img

By

Published : Apr 29, 2020, 9:15 AM IST

దేశంలో కరోనా కేసులు 31 వేల 332కు చేరాయి. ఇప్పటివరకు 1007 మంది వైరస్​ ​ కారణంగా మరణించారు. 24 గంటల వ్యవధిలో 1897 కొత్త కేసులు నమోదుకాగా.. 73 మంది చనిపోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Total number of #COVID19 positive cases in India rises to 31332 including 1007 deaths
దేశంలో కరోనా కేసుల వివరాలు

మొత్తం 7,695 మంది కోలుకోగా.. ప్రస్తుతం 22 వేల 629 యాక్టివ్​ కేసులున్నాయి.

భారత్​లో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు 9318కి చేరాయి. రాష్ట్రంలో 1388 మంది కోలుకున్నారు. మరో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో కరోనా మృతుల సంఖ్య 181కి పెరిగింది. మధ్యప్రదేశ్​లో 120, దిల్లీలో 54, రాజస్థాన్​లో 51 చొప్పున మరణించారు.

ఆంధ్రప్రదేశ్​లో 1259, తెలంగాణలో 1004 మంది కరోనా బారిన పడ్డారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య వరుసగా 31,26గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.