దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 41మంది మరణించారు. 1,409 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఈ రోజు ఉదయం 9గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,85,172మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) వెల్లడించింది. ఇందులో 21,797 పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది.
క్వారంటైన్లో పోలీసు సిబ్బంది...
ఉత్తరప్రదేశ్‌లోని 73మంది పోలీసు సిబ్బందిని అధికారులు బుధవారం క్వారంటైన్ చేశారు. నావాబ్పుర రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 17మందిని పోలీసులు అరెస్టు చేయడం.. వారిలోని ఐదుగురికి వైరస్ గుర్తించడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 73మంది పోలీసు సిబ్బంది నమూనాలను పరీక్షలకు పంపినట్టు వెల్లడించారు.
ఈ నెల 15న నవాబ్పుర ప్రాంతంలో కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తుండగా ఆరోగ్య సిబ్బందిని కొందరు అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడి చేశారు.
రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌లో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,935కు పెరిగింది. 27మంది మృతిచెందగా 344మంది కరోనాను జయించారు.
ఇదీ చూడండి:- అకడమిక్ క్యాలెండర్లో మార్పుల దిశగా రాష్ట్రాల యోచన!