కుటుంబ పెద్దను కోల్పోయామన్న దిగులు ఓవైపు. లాక్డౌన్ వేళ కువైట్ నుంచి మృతదేహాన్ని తీసుకురాలేని నిస్సహాయత మరోవైపు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంది రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం. చివరకు బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించి... పెద్దాయన ఆత్మశాంతి కోసం ప్రార్థించింది.
కువైట్‌లో ఖననం... ఇక్కడ దహనం...
రాజస్థాన్ డుంగర్పుర్ సీమల్వారాకు చెందిన 56 ఏళ్ల దిలీప్ కలాల్ 15 ఏళ్లుగా కువైట్‌లో హోటల్ నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 20 రోజులు చికిత్స అందించినా వైద్యులు దిలీప్ ప్రాణాలు కాపాడలేకపోయారు.
కరోనా సంక్షోభంతో దేశాల మధ్య రాకపోకలు లేవు. ఈ పరిస్థితుల్లో దిలీప్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చే వీలు లేదు. చేసేది లేక కువైట్‌లోని హోటల్ సిబ్బందే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని ఖననం చేసి, ఆ దృశ్యాల్ని కుటుంబ సభ్యులకు పంపారు.
దిలీప్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు... కనీసం ఆయనకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలైనా నిర్వహించాలని అనుకున్నారు. దిలీప్ పాత దుస్తులు, ఫొటోతో ఓ బొమ్మను తయారు చేశారు. మృతుడి కుమారుడు సహా మరో 10 మంది కలిసి ఊరేగింపుగా బొమ్మను తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అస్థికలు సేకరించి... ఆత్మశాంతి కోసం ఇతర పూజా కార్యక్రమాలు జరిపించారు.
ఇదీ చూడండి: దేశంలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితా