ETV Bharat / bharat

'లోక్​సభ ఎన్నికలు రద్దు చేయాలని అడుగుతున్నారా?' - లోక్​సభ

ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్​ను స్వీకరించలేమని కొట్టివేసింది.

'లోక్​సభ ఎన్నికలు రద్దు చేయాలని అడుగుతున్నారా?'
author img

By

Published : Jul 5, 2019, 8:42 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషన్​(ఈవీఎం)లను వినియోగించి నిర్వహించిన లోక్​సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇలాంటి పిటిషన్​ను స్వీకరించలేమని కొట్టివేసింది.

న్యాయవాది ఎమ్​ఎల్​ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​​ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. పిటిషన్​ విచారణకు యోగ్యత లేనిదని పేర్కొంది. మీరు ఏమి అడుగుతున్నారో అర్థమవుతుందా.. మొత్తం లోక్​సభ ఎన్నికలను పక్కన పెట్టాలని కోరుకుంటున్నారా? అంటూ పిటిషనర్​ను ప్రశ్నించింది ధర్మాసనం.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నింబంధనలను వ్యాజ్యంలో ప్రస్తావించారు పిటిషనర్​​. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్​ పేపర్లను వినియోగించాలని చట్టంలో ప్రత్యేకంగా పేర్కొన్నప్పుడు.. ఎన్నికల సంఘం బ్యాలెట్​ పేపర్ల స్థానంలో ఈవీఎంలను వినియోగించకూడదని పిటిషన్​లో తెలిపారు.

ఇదీ చూడండి: పెట్రో వాత రూ.2 కాదు... అంతకుమించి!

Intro:Body:

q

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.