ఇండియా పేరును 'భారత్' లేదా 'హిందుస్థాన్'గా మార్చేందుకు ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించింది సుప్రీంకోర్టు.
ఆర్టికల్ 1లో సవరణలు చేసి ఇండియా పేరును భారత్‌గా మార్చాలని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలో దేశం పేరు భారత్ అని కూడా ఉందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. సంబంధిత మంత్రిత్వ శాఖలు రిప్రజంటేషన్‌గా పరిగణించి నిర్ణయం తీసుకోవాలని, పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఇండియా అనే పేరుకు బదులుగా భారత్ లేదా హిందుస్థాన్ అనే పదాలను వాడాలంటూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో గతవారం పిటిషన్ దాఖలు చేశారు. భారత్, హిందుస్థాన్ అనే పేర్లు భారత చరిత్రను తెలియజేసేలా ఉంటాయని పిటిషన్‌లో పేరొన్నారు. 1948లో కూడా వీటి పేర్ల ప్రస్తావన వచ్చినట్లు వివరించారు.