దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 5,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 132 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 132 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 65, గుజరాత్- 30, మధ్యప్రదేశ్- 9, దిల్లీ- 8, రాజస్థాన్- 4, ఉత్తర్ప్రదేశ్- 4, బంగాల్- 3, తమిళనాడు- 3, తెలంగాణ- 2; ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్ము కశ్మీర్, బిహార్, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున్న నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు 40.32 శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
ఇదీ చూడండి: ప్యాకేజీ కష్టాలు: ఉద్దీపనలకు నిధులు ఎలా?