ETV Bharat / bharat

రేపు ఉదయం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

author img

By

Published : Apr 13, 2020, 3:10 PM IST

రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. రేపటితో 21 రోజుల లాక్​డౌన్​ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను మరికొంత కాలం పొడిగించే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Prime Minister Narendra Modi will address the nation at 10 AM tomorrow
జాతినుద్దేశించి రేపు మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్​​డౌన్​ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో లాక్​డౌన్​ పొడిగింపుపై మోదీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్​డౌన్​ పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

గతనెలలో రెండు సార్లు మోదీ ప్రజల ముందుకొచ్చారు. మార్చి 22న దేశమంతటా జనతా కర్ఫ్యూ ప్రకటించగా... అనంతరం మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్​డౌన్​ విధించారు.

ఈ మధ్యలో ఏప్రిల్​ 3న ప్రజలకు వీడియో సందేశమిచ్చారు. ఏప్రిల్​ 5న అందరూ ఇళ్లలో లైట్లు ఆపి రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనాపై పోరులో దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.