ETV Bharat / bharat

కారు ఆపిన పోలీసుకు గుంజీల శిక్ష! - police sit ups while lockdown duty

లాక్​డౌన్​ వేళ పగలనకా, రేయి అనకా డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు శ్రమిస్తున్నారు. అయితే.. తన కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు బిహార్​లో ఓ పోలీసు గుంజీలు తీయాల్సివచ్చింది. ఎందుకో తెలుసా...?

Policeman made to do sit-ups for stopping agri officer's vehicle during lockdown
కారు ఆపిన పోలీసుకు గుంజీల శిక్ష!
author img

By

Published : Apr 21, 2020, 9:24 PM IST

దేశంలో విజృంభిస్తున్న కరోనాకు కళ్లెం వేసేందుకు ఉన్న ఏకైక మార్గం.. లాక్​డౌన్. మరి ఆ లాక్​డౌన్​​ సక్రమంగా అమలు చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై గస్తీ కస్తున్నారు పోలీసులు. కానీ, వారి ప్రయత్నానికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ.. అధికారాన్ని బలాన్ని చూపిస్తున్నారు కొందరు సీనియర్​ అధికారులు. బిహార్​ అరారీయాలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు ఓ పోలీసును 50 గుంజీలు తీయించారు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ).

అనుమతి పత్రం చూపమన్నందుకు...

సూరజ్​పుర్​ వంతెన వద్ద, జోకీహాట్​ పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో లాక్​డౌన్​ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నాడు హోంగార్డు గణేశ్​ లాల్​ తాత్మా. అదే దారిలో డీఏఓ మనోజ్​ కుమార్​ వాహనం వచ్చింది. అన్ని వాహనాల్లాగే ఆ కారునూ ఆపి.. ఆరా తీశాడు లాల్​. ఎక్కడికైనా వెళ్లాలంటే అధికారిక అనుమతి పత్రాన్ని చూపించమని కోరాడు.

అంతే, డీఏఓ కారునే ఆపుతావా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు మనోజ్​. 'ఉన్నతాధికారుల ముందు నువ్వు నన్ను అవమానించావు. నేను తలచుకుంటే నిన్ను జైల్​కు పంపగలను.' అని సవాల్​ చేశాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతూ.. హోంగార్డునే గుంజీలు తీయించాడు.

ఈ విషయమై అరారీయా జిల్లా ఐజీ, ఎస్పీలతో మాట్లాడి.. నివేదిక కోరారు బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే. పూర్తి వివరాలు తెలిశాక హోంగార్డుతో దురుసుగా ప్రవర్తించిన ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతిపక్ష నేత స్పందన..

బిహార్​ శాసనసభా ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"బిహార్​లో అధికార యంత్రాంగానికి అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఓ జిల్లా వ్యవసాయ అధికారిని అధికారిక పాస్ చూపించమని అడిగినందుకు కాపాలాదారున్ని గుంజీలు తీయమంటారా?

-తేజస్వీ యాదవ్​

కరోనా విజృంభిస్తున్న సమయంలో క్షేత్ర స్థాయిలో సేవలందిస్తున్న పోలీసులపైనే దాడికి దిగుతున్నారు కొందరు. బిహార్​లోనే కాదు.. పంజాబ్​ పటియాలాలోనూ కేవలం వాహనాన్ని ఆపి అనుమతి పత్రాన్ని కోరినందుకు కొద్దిరోజుల క్రితం ఓ పోలీసు అధికారి చెయ్యి నరికేశారు దుండగులు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వేళ అంబులెన్స్​లో 3,213 కి.మీల ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.