కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. దృశ్యమాధ్యమం ద్వారా జరగనున్న ఈ భేటీలో ఏడు రాష్ట్రాల సీఎంలతో పాటు ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొననున్నారు.
ఈ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు, మహమ్మారిని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ ఏడు రాష్ట్రాల్లోనే 65.5 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, దిల్లీ, పంజాబ్ ఉన్నాయి. క్రియాశీల కేసుల్లో 63శాతం, మరణాల సంఖ్యలో 77 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర్ భారత్ సృష్టించడంలో అదే కీలకం'