ETV Bharat / bharat

రాత్రి 8 గంటలకు మోదీ ప్రసంగం- లాక్​డౌన్​పై ప్రకటన! - లాక్​డౌన్​ పొడిగింపు

PM Narendra Modi to address the nation at 8 PM today
రాత్రి 8 గంటలకు మోదీ ప్రసంగం- లాక్​డౌన్​పై ప్రకటన!
author img

By

Published : May 12, 2020, 12:17 PM IST

Updated : May 12, 2020, 1:09 PM IST

12:36 May 12

మోదీ ప్రసంగంలో ఏముంటుంది?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈరోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్​ విజృంభణ, ఈ నెల 17తో లాక్​డౌన్​ ముగియనున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ద్విముఖ వ్యూహంపై ప్రకటన!

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగింపు అనివార్యం అని తెలుస్తోంది. ఇదే విషయంపై సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో లాక్​డౌన్​ పొడిగించాలంటూ పలువురు ముఖ్యమంత్రులు మోదీని అభ్యర్థించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. 

ప్రజల ప్రాణాలను కాపాడుతూనే, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు మోదీ. అందుకు అనుగుణంగా చేపట్టనున్న చర్యల్ని నేటి రాత్రికి మోదీ వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దశల వారీగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులిస్తోంది ప్రభుత్వం.

వలస కూలీల కష్టాలపై...

వలస కూలీల వ్యవహారంపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. పలువురు కూలీలు రైలు ప్రమాదంలో మృతి చెందడం, మరికొంత మంది స్వస్థలాలకు నడిచి వెళుతూ మరణించడంపై ప్రధాని ప్రస్తావిస్తారని సమాచారం. 

వలస కూలీలను తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. మరికొన్ని రాష్ట్రాలు వచ్చిన వారి విషయంలో అలసత్వం ప్రదర్శించడంపై ప్రధాని అసంతృప్తి గా ఉన్నట్లు సమాచారం. దీనితోపాటు పలు చోట్ల లాక్​డౌన్​ నిబంధనలు అమలులో ప్రజలు ఇష్టా రీతిలో వ్యవహరించడం పై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.

12:15 May 12

రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఈమేరకు వెల్లడించింది.

సర్వత్రా ఆసక్తి..

కరోనా కట్టడి కోసం విధించిన లాక్​డౌన్​ 3వ దశ... ఈనెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

దేశంలో ప్రస్తుత పరిస్థితి సహా కరోనాపై పోరులో భవిష్యత్​ కార్యాచరణకు సంబంధించి సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విస్తృతంగా చర్చించారు మోదీ. ప్రజల ప్రాణాలను కాపాడుతూనే, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు మోదీ. అందుకు అనుగుణంగా చేపట్టనున్న చర్యల్ని నేటి రాత్రికి మోదీ వెల్లడించే అవకాశముంది.

Last Updated : May 12, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.