స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రంను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. దిల్లీ బాపూఘాట్‌లోని కేంద్రాన్ని సందర్శించిన అనంతరం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 విద్యార్థులతో మాట్లాడనున్నారు.
2017 ఏప్రిల్ 10న చంపారన్ సత్యాగ్రహా శత వేడుకలను పురస్కరించుకుని గాంధీకి నివాళి అర్పిస్తూ రాష్ట్రీయ స్వచ్ఛ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
భవిష్యత్‌లో రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాలకు ప్రపంచంలోనే విసృత స్థాయిలో ప్రచారం లభిస్తుందని ఆశిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమ రెండో దశను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభిస్తారు.
360 డిగ్రీల వీడియోలతో
స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత, పరిశుభ్రత వంటి అంశాలపై రూపొందించిన 360 డిగ్రీల వీడియోల ద్వారా అవగాహాన కల్పించనున్నారు.