మహమ్మారి కరోనా గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఇటీవలే ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు ఆరోగ్య సేతు యాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగాదారులకు నకిలీ సందేశాలు పంపించి వారి డేటాను సైబర్ మోసగాళ్లు దొంగిలిస్తున్నారని జాతీయ సైబర్ భద్రతా విభాగం తెలిపింది.
అనుమానం రాకుండా..
వినియోగాదారులకు అనుమానం రాకుండా.. వారి డేటాను దొంగిలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తున్నారు.
"ఆరోగ్యసేతు పేరుతో మోసాలు భారీగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు మానవ వనరుల విభాగాధిపతి లేదా సీఈఓలా వ్యవహరిస్తారు. ఆపై 'మీ పొరుగువారు కరోనా బారిన పడ్డారు, మీ చుట్టు పక్కల వైరస్ ఎంతమందికి సోకిందో తెలుసుకోండి, మీతో సంబంధం ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది, స్వీయ నిర్బంధంలో ఉండండి, ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడానికి ఈ మార్గదర్శకాలను పాటించండి,' అంటూ సందేశాలు పంపి వినియోగాదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు."
-కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా
ఆరోగ్య సేతు పేరిట వచ్చిన ఫేక్ మెసేజ్‌లలోని లింకులు క్లిక్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్లనే పోలి ఉన్న నకిలీ వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించి, దుర్వినియోగం చేస్తున్నారు మోసగాళ్లు.
ఇదీ చూడండి: వలసయేతర కూలీల ఆదాయంపైనా లాక్డౌన్ ప్రభావం