కర్ణాటక మంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేరళకు చెందిన ఓ రోగిని బలవంతంగా డిస్చార్జ్ చేశారు. అతడు 50 కిలోమీటర్లు దూరం నడిచి కేరళ సరిహద్దు ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయాడని పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది...
కేరళలోని కాసరగోడ్ జిల్లాకు చెందిన బాలన్ అనే వ్యక్తి కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయాడు. అతని బందువులు మార్చి 21న కర్ణాటక మంగళూరులో ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. అయితే ఉన్నట్టుండి ఆస్పత్రి అధికారులు బాలన్‌ను డిస్చార్జ్ చేసి బలవంతంగా బయటకు పంపించివేశారు. లాక్‌డౌన్‌తో వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడం వల్ల అక్కడి నుంచి కేరళవైపు నడవడం ప్రారంభించాడు. అలా వస్తూ సరిహద్దు ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు. బాధితుడికి, అతని బందువుల కోసం వాహనాన్ని ఏర్పాటు చేసి, స్వస్థలానికి చేర్చినట్లు చెప్పారు.
లాక్డౌన్ సహా కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికే కర్ణాటక సరిహద్దులను మూసి వేసింది. కాసర్‌గోడ్‌కు దగ్గర్లోని మంగళూరు ఆస్పత్రులకు వెళ్లేందుకు వీలు లేక ఇప్పటికే ఏడుగురు మరణించారు.
ఇదీ చూడండి: మద్యం ప్రియులను 'ఏప్రిల్ ఫూల్స్' చేసిన వైన్ షాపు