పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉన్నట్లు పాక్ అంగీకరించడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వ విమర్శకుల నోటికి తాళం పడిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాలు పరోక్షంగా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయని విమర్శించారు. బిహార్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ మేరకు విపక్షాలపై ధ్వజమెత్తారు రాజ్‌నాథ్.
"దేశ భద్రత కోసం పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్‌ను రెండుగా విభజించినప్పుడు.. ఆమెను పార్లమెంటులో భాజపా సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రశంసించారు. కానీ ప్రభుత్వం సాధించిన విజయాలపై సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తడమే ఇప్పుడు కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది." - రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి.
దేశ ప్రాదేశిక సమగ్రత సమస్యపై కలిసి పనిచేయాలని హితవు పలికారు రాజ్‌నాథ్.
ఇదీ చూడండి: మోదీ గుజరాత్ టూర్.. గాంధీనగర్ టూ ఐక్యతా విగ్రహం