జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కరోనాను జయించేందుకు ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తున్న శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా 1998లో రాజస్థాన్ పోఖ్రాన్లో అణు పరీక్షలను నిర్వహించి దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాన్ని ఆయన గుర్తు చేశారు.
"ఈ జాతీయ సాంకేతిక దినోత్సవాన.. ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్న వారందరికీ దేశం సలాం చేస్తోంది. 1998లో ఇదే రోజున మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనవిజయం మరువలేనిది. ఆ ఘట్టం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్-19 నుంచి దేశాన్ని కాపాడేందుకు సాంకేతికత దోహదపడుతోంది. వైరస్ను మట్టుబెట్టేందుకు ఆవిష్కరణలు, పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సలాం. "
-ప్రధాని నరేంద్ర మోదీ
ఇదీ చదవండి:మద్యం షాపుల ముందు నారీమణుల బారులు!