ETV Bharat / bharat

కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం - Bachchan, Dharmendra join film industry peers to spread awareness about Janta Curfew

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు యావద్దేశం జనతా కర్ఫ్యూను పాటించనుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని ఇచ్చిన ఈ పిలుపునకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్దతును తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లోని రవాణా సౌకర్యాలను మూసివేస్తిన్నట్లు ప్రకటించాయి. పలువురు సెలబ్రిటీలు కూడా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు.

curfew
కరోనాపై ఐక్యతతో పోరాడుదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం
author img

By

Published : Mar 21, 2020, 6:10 PM IST

Updated : Mar 21, 2020, 6:40 PM IST

దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. మహమ్మారినుంచి దేశాన్ని రక్షించేందుకు స్వచ్ఛంద కర్ఫ్యూకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘీభావం ప్రకటించాయి.

'దేశాన్ని కాపాడదాం.. కరోనాను అరికడదాం' అంటూ సెలబ్రిటీలు సైతం తమ వీడియోల ద్వారా ప్రజలకు జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పిస్తున్నారు. కర్ఫ్యూలో భాగంగా ముందస్తుగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు రవాణా సేవలను మూసివేస్తిన్నట్లు ప్రకటించాయి.

బిగ్​బీ ఏమన్నారంటే..?

ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రజలకు బాలీవుడ్ ప్రముఖులు పిలుపునిచ్చారు. బిగ్​బీ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అనిల్ కపూర్ కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరారు. అమితాబ్​ బచ్చన్ ఇన్​స్టాగ్రామ్ వేదికగా కర్ఫ్యూను పాటిస్తానని.. సాయంత్రం 5 గంటలకు కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ శంఖాన్ని పూరిస్తానని చెప్పారు.

తెలంగాణలో 24 గంటలు..

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని చెప్పారు. రేపు ఆర్టీసీ బస్సు సేవలను రద్దు చేస్తున్నామని, మెట్రో సేవలు సైతం మూసివేస్తున్నామని చెప్పారు. అంతర్రాష్ట్ర బస్సులను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

5జిల్లాల మూసివేత..

కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూలో పాల్గొననున్నట్లు పిలుపునిచ్చింది ఒడిశా ప్రభుత్వం. 5 జిల్లాలు, 8 పట్టణాల్లో షట్​డౌన్​ ప్రకటించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.

ముంబయి మెట్రో బంద్..

ముంబయి మెట్రో సేవలు ఆదివారం సంపూర్ణంగా నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రోజూ నాలుగు లక్షలమంది ప్రయాణించే మెట్రోను పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మోనోరైలు సేవలను కూడా నిలిపివేయనున్నట్లు ముంబయి రైల్వే అధికారులు తెలిపారు.

తమిళనాడులో బస్సులు, మెట్రో బంద్..

జనతా కర్ఫ్యూ సందర్భంగా తమిళనాడులో బస్సులు, మెట్రో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి పళనిస్వామి. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రాకూడదని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపట్ల మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

సీఏఏ వ్యతిరేక గళం..

జనతా కర్ఫ్యూ సందర్భంగా పౌరచట్టం, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నట్లు దిల్లీకి 'యూనైటెడ్​ అగైనెస్ట్​ హేట్'​ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. తమ ఇళ్లల్లో నిల్చుని సాయంత్రం 5గంటలకు నినాదాలు చేయనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: థర్మల్​ స్కానింగ్​ ఇలా కూడా చేయొచ్చా?

Last Updated : Mar 21, 2020, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.