ETV Bharat / bharat

నది ఒడ్డున ఇసుకలోనే ప్రసవ వేదన - vanyampuzha bridge

ప్రసవ వేదన తాళలేక.. గ్రామానికి, ఆసుపత్రికి నడుమనున్న నదిని దాటించే వంతెన లేక.. ఇసుకలోనే బిడ్డకు జన్మనిచ్చింది కేరళకు చెందిన ఓ మహిళ.

No bridge to cross over River Chaliyar since 2019 floods; Demands remain unheard
నదీ ఒడ్డున ఇసుకలోనే ప్రసవం!
author img

By

Published : Jun 29, 2020, 1:17 PM IST

Updated : Jun 29, 2020, 1:44 PM IST

కేరళ మళప్పురంలో నది ఒడ్డున ఇసుకలోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ గిరిజన మహిళ.

ముండేరీ వంజ్యంపుళ గిరిజన గ్రామం నుంచి నగరంలోకి వెళ్లేందుకు నదిపై ఉన్న వంతెన 2019 వరదల్లో కొట్టుకుపోయింది. వంతెన పునర్​ నిర్మించాలని ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని కోరారు అక్కడి ప్రజలు. గ్రామసభలోనూ వారధి​ కావాలని తీర్మానం చేశారు. కానీ, సంబంధిత అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆ గ్రామానికి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.

నది ఒడ్డున ఇసుకలోనే ప్రసవ వేదన

ఆ గ్రామానికి చెందిన 27 ఏళ్ల నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతోంది. కానీ, వంతెన లేక అంబులెన్స్​ నది ఒడ్డు అవతలి పక్క వరకు మాత్రమే చేరుకోగలిగింది. దీంతో అటవీ శాఖ నుంచి ఓ చెక్క తెప్పను అరువు తీసుకుని.. మహిళను ఒడ్డు దాటించారు గ్రామస్థులు.

కానీ, అప్పటికే నొప్పులు తీవ్రమైన గర్భిణి.. నది ఒడ్డునే కూలబడింది. ఆమెతో పాటు వచ్చిన మహిళలు ఓ వస్త్రాన్ని అడ్డుపెట్టారు. గ్రామస్థుల సాయంతో ఇసుకలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. ఆ తర్వాత అంబులెన్స్​లో వచ్చిన వైద్య సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి.. నిలాంబర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:చైనా 'షేరిట్​'ను తలదన్నే స్వదేశీ యాప్​ వచ్చేసింది!

Last Updated : Jun 29, 2020, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.