ETV Bharat / bharat

30ఏళ్లుగా ఆ రాష్ట్ర వాసికి పాక్​ నుంచి ప్రత్యేక రాఖీ - ముస్లిం మహిళ

పాక్​కు చెందిన ఓ మహిళ.. భారత్​లోని హిందువుకు 30 ఏళ్లుగా రాఖీ పంపుతూ.. మతాలు, దేశాలు, రాగద్వేషాలకు అతీతంగా తన సోదరభావాన్ని చాటుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది రక్షాబంధన్ వేడుకలను స్వయంగా భారత్​కు వచ్చి చేసుకోవాలని ఆమె భావించినా.. కరోనా వ్యాప్తి కారణంగా రాలేకపోయానని చెప్పారు.

Muslim woman from Pakistan sends rakhi to Hindu man in Madhya Pradesh for last 30 years
30 ఏళ్లుగా ఆ రాష్ట్ర వాసికి పాక్ నుంచి ప్రత్యేక రాఖీ
author img

By

Published : Aug 3, 2020, 8:56 PM IST

ఇరు దేశాల మధ్య ఎన్ని రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. భారత్​లో ఉండే ఓ హిందువుకు ఏటా రాఖీ పంపుతున్నారు పాకిస్థానీ మహిళ. 30 ఏళ్లుగా భారత్​కు రాఖీ పంపుతున్నారంటే ఈ ముస్లిం- హిందువుల సోదరభావం ఎలాంటిదో మనమే అర్థం చేసుకోవాలి. మధ్యప్రదేశ్​- హర్దా జిల్లాకు చెందిన పంకజ్​ బఫ్నా(52)కు రక్షాబంధన్​వచ్చిందంటే చాలు.. పాక్​కు నుంచి పార్శిల్​ వస్తుంది. ఆ కొరియర్​ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తానని చెబుతున్నాడు పంకజ్​.

30ఏళ్లుగా ఆ రాష్ట్ర వాసికి పాక్​ నుంచి ప్రత్యేక రాఖీ

షాహిదా చిన్నతనంలో ఓ సారి మధ్యప్రదేశ్​కు రాగా.. అక్కడ తన బంధువుల తరఫునుంచి పంకజ్​తో పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటినుంచి ఏటా ప్రతి రక్షాబంధన్​కు ఆయనకు రాఖీ పంపుతున్నాను అని చెప్పుకొచ్చారు షాహిదా.

Muslim woman from Pakistan sends rakhi to Hindu man in Madhya Pradesh for last 30 years
పంకజ్​తో వీడియో కాలింగ్​లో షాహిదా ఖలీల్​

'బాల్యంలో నేను ఓ సారి హర్దాకు వచ్చాను. అప్పుడు మా బంధువుల స్నేహితుడైన పంకజ్​తో నాకు మంచి సోదరభావం ఏర్పడింది. అప్పటినుంచి తనకు ఏటా రాఖీ పంపుతున్నా. 2013లో పంకజ్​కు స్వయంగా నేనే రాఖీ కట్టా. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఏడాది కూడా దిల్లీకి రావాలి అనుకున్నాను. కానీ కొవిడ్​ కారణంగా రాలేకపోయాను.'

- షాహిదా ఖలీల్​, పాక్​ మహిళ

అలా ఏటా షాహిదా పంపిన రాఖీని.. తన సోదరి నమ్రతా లోధాతో కట్టించుకుంటానని చెప్పారు పంకజ్​.

పంకజ్​కు రాఖీ కడుతోన్న సోదరి నమ్రతా లోధా

ఇదీ చదవండి: 'మోదీ కృషిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.