ETV Bharat / bharat

వైరస్​పై 12 రోజుల శిశువు జయకేతనం

పుట్టగానే ఆ నవజాత శిశువుకు కరోనా సోకింది. 'బిడ్డ భవిష్యత్​ ఏంటో?' అని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుండగా.. వైద్యులు అందించిన చికిత్సతో వైరస్​పై జయకేతనం ఎగరేసింది ఆ చిన్నారి. రోజుల శిశువే అయినప్పటికీ రెండు లక్షలమందికి పైగా ప్రాణాలు తీసిన కరోనాపై తనదే పైచేయి అని నిరూపించింది.

corona
వైరస్​పై నవజాత శిశువు విజయకేతనం
author img

By

Published : May 2, 2020, 3:01 PM IST

'ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని.. నువ్వెంత' అంటూ పురిట్లోనే ఆ నవజాత శిశువుకు కరోనా సోకింది. కానీ మంచి చెడూ తెలియని ఆ నిఖార్సైన చిన్నారి వద్ద ఉండలేకపోయింది. నిర్మలమైన ఆ నవ్వు చూడలేక తోక ముడిచి పారిపోయింది. 12 రోజుల శిశువే కానీ 2 లక్షలమందికి పైగా బలి తీసుకున్న వైరస్​ను ఓడించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​లో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..

ఏప్రిల్ 7న భోపాల్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. 11న డిశ్చార్జి అయ్యారు. అయితే పురిటి సమయంలో సహాయకురాలిగా ఉన్న ఉద్యోగికి వైరస్ పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అధికారులను సంప్రదించారు తల్లిదండ్రులు. ఇంట్లోని వారందరికీ పరీక్షలు చేసిన అధికారులు నవజాత శిశువుకు మాత్రమే కరోనా సోకినట్లు నిర్ధరించారు. తల్లి సహా శిశువును ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు అందించిన చికిత్సతో వైరస్​ను గెలిచింది ఆ చిన్నారి. వైరస్​పై విజయం సాధించిన తమ కుమార్తెకు 'ప్రకృతి' అని నామకరణం చేశారు తల్లిదండ్రులు.

అయితే వైరస్​పై విజయం సాధించిన శిశువును, తల్లిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొంతకాలం నిర్బంధంలో ఉంచనున్నట్లు వెల్లడించారు అధికారులు.

ఇదీ చూడండి: కాంక్రీట్​ మిక్సర్​ ట్యాంక్​లో 18 మంది కూలీల ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.