ముగిసిన మోదీ, రాజ్‌నాథ్‌ల భేటీ
ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ ముగిసింది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్... తదుపరి భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
21:15 June 17

21:02 June 17
గాల్వన్‌లో ముగిసిన భారత్ చైనా మేజర్ జనరల్స్ సమావేశం
తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా మేజర్ జనరల్స్ చేపట్టిన చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో సరిహద్దు సమస్య పరిష్కారంపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రానున్న రోజుల్లో ఇరుదేశాల మధ్య మరిన్ని చర్చలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
20:40 June 17
ప్రధానితో మరోసారి రాజ్‌నాథ్ భేటీ..
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో మరోసారి భేటీ అయ్యారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.
20:25 June 17
నిలకడగా ఆరోగ్యం...
గాల్వాన్ లోయ హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు ఆర్మీ సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉనట్టు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
19:41 June 17
చర్చలను స్వాగతిస్తున్నాం..
"వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించడానికి విదేశాంగ మంత్రుల చర్చలతో పాటు ఇరు దేశాలు తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తున్నాం. అంతా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం."
--- నికోలేయ్ కుదషేవ్, భారత్‌లోని రష్యా రాయబారి.
19:17 June 17
సునీల్ కుమార్‌కు నివాళి
బిహార్ రాజధాని పాట్నా విమానాశ్రయంలో హవల్దార్ సునీల్ కుమార్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్ జస్వాల్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నివాళులర్పించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలో సునీల్ కుమార్ అమరుడయ్యాడు.
19:04 June 17
రష్యా స్పందన
భారత్-చైనా సరిహద్దు పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రష్యా స్పందించింది.
"సమస్యను పరిష్కరించుకోవడానికి మిలిటరీ స్థాయి ప్రతినిధులు రంగంలోకి దిగినట్టు ఇప్పటికే ఇరు దేశాలు వెల్లడించాయి. ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు చర్చలు జరుపుతున్నాయి. దీనిని మేము స్వాగతిస్తున్నాం."
--- సర్గేయ్ లావ్రోవ్, రష్యా విదేశాంగమంత్రి.
18:54 June 17
రాష్ట్రపతి స్పందన
గాల్వన్ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు.
సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి భారత సైనికులు చూపించిన ధైర్యం, అత్యున్నత త్యాగానికి నేను నమస్కరిస్తున్నాను. గాల్వన్ లోయలో ప్రాణాలు అర్పించిన వారందరూ భారత సాయుధ దళాల సంప్రదాయాన్ని నిలబెట్టారు.
---- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
18:15 June 17
శాంతియుత పరిష్కారం దిశగా...
17:24 June 17
పక్కా ప్రణాళిక ప్రకారమే: జైశంకర్
గాల్వన్ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదనీ.. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా పేర్కొన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఘటనకు చైనా బాధ్యత వహించాలని చెప్పినట్లు సమాచారం. చైనా విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్లో సంభాషించగా ఈ వ్యాఖ్యలు చేశారు.
16:48 June 17
సంయమనం పాటించాలి: ఈయూ
16:47 June 17
చర్చల ద్వారానే పరిష్కారం: చైనా
16:25 June 17
జైశంకర్‌తో సంభాషించిన చైనా విదేశాంగ మంత్రి..
భారత్-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో ఫోన్లో సంభాషించారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది.
సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చించారు. ఘర్షణకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భారత్‌ను కోరినట్లు ఓ వార్తా పత్రిక వెల్లడించింది.
15:41 June 17
సోనియా గాంధీ కీలక వ్యాఖ్య..
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సరిహద్దు వెంట భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించుకుందో, భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో ప్రధాని చెప్పాల్సినఅవసరం ఉందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశం, సైనికుల వెంటే కాంగ్రెస్ ఉంటుందని స్పష్టం చేశారు. సమష్టిగా శత్రువును ఎదుర్కోవాలని అన్నారు.
15:12 June 17
అమర వీరులకు మోదీ నివాళి
తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ముఖ్యమంత్రులతో సమావేశం ప్రారంభానికి ముందు మోదీ మౌనం పాటించారు.
సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేము: ప్రధాని మోదీ
భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ
సైనికుల త్యాగాలు వృథాగా పోవని దేశానికి హామీ ఇస్తున్నా: ప్రధాని మోదీ
ఈనెల 19న అఖిలపక్ష సమావేశం: ప్రధాని మోదీ
దేశ, ఐక్యత సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యతాంశాలు: ప్రధాని
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: ప్రధాని
ఎవరైనా రెచ్చగొడితే దీటుగా బదులు ఇవ్వడానికి సిద్ధం: ప్రధాని
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది: ప్రధాని