స్వాతంత్ర్యం అనంతరం తొలిసారి జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే' అంటూ ఎన్నికల నాటి భాజపా నినాదాన్ని ప్రయోగిస్తూ ట్వీట్ చేశారు.
1947 తర్వాత జీడీపీ వృద్ధి కనిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ట్వీట్‌కు జతచేశారు.
-
मोदी है तो मुमकिन है। pic.twitter.com/V1fS7nStIt
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मोदी है तो मुमकिन है। pic.twitter.com/V1fS7nStIt
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020मोदी है तो मुमकिन है। pic.twitter.com/V1fS7nStIt
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020
దేశ వాస్తవ జీడీపీ.. 2021 తొలి అర్ధభాగంలో క్షీణిస్తుందని గతవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. చైనా చొరబాట్లు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరోనా నిర్వహణపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఇదీ చదవండి- పుట్టిన రోజున కరోనాను జయించిన మాజీ సీఎం